గేమ్ ఛేంజర్ కోసం ముందుగా ఆ హీరోని అనుకున్నారు నేనే వద్దని చెప్పాను: దిల్ రాజు

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దిల్ రాజు(Dil Raju) ప్రస్తుతం పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈయన తెరకెక్కిస్తున్న సినిమాలలో గేమ్ ఛేంజర్(Game Changer) ఒకటి.అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా శంకర్( Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ramcharan)హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.

"""/" / రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడమే కాకుండా గేమ్ ఛేంజర్ గా రామ్ చరణ్ పోస్టర్ ను కూడా విడుదల చేయడంతో ఈ పోస్టర్ ఒక్కసారిగా వైరల్ అయింది.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి దిల్ రాజు ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ముందుగా శంకర్ తనకు ఈ సినిమా కథ చెప్పినప్పుడు హీరోగా రామ్ చరణ్ ను కాకుండా మరొక హీరో పేరును తీసుకువచ్చారట.

అయితే ఈ సినిమాకు రామ్ చరణ్ కరెక్ట్ గా సరిపోతారని దిల్ రాజు సలహా ఇవ్వడంతో ఈ సినిమా అవకాశం రామ్ చరణ్ కు వచ్చిందని తెలిపారు.

"""/" / మరి శంకర్ గేమ్ ఛేంజర్ కోసం ముందుగా అనుకున్న హీరో ఎవరు.

ఏంటి అనే విషయానికి వస్తే.ఈ సినిమా పాలిటిక్స్(Politics) ఎలక్షన్స్(Elections) చుట్టూ తిరుగుతూ ఉంటుంది కనుక ఈ సినిమాలో నటించడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అయితే కరెక్ట్ గా సరిపోతుందని శంకర్ భావించారట.

ఇక ఈ విషయం విన్నటువంటి దిల్ రాజు పవన్ కళ్యాణ్ కన్నా ఈ సినిమాకు రామ్ చరణ్ అయితే బాగుంటుందని సలహా ఇచ్చారట.

ఇక రామ్ చరణ్ కు కథ వివరించే సమయంలో శంకర్ రామ్ చరణ్ కు బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీసుకురావడానికి సిద్ధమయ్యారని ఈ సందర్భంగా దిల్ రాజు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

డబ్బులు ఎక్కువై ఈ సినిమాలు తీశారా.. వాటిని చూస్తే మతిపోతుంది..?