తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు.
గతంలో సిట్ నోటీసులు ఇవ్వగా బండి సంజయ్ విచారణకు హాజరుకాని విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న బండి సంజయ్ ను సిట్ అధికారులు విచారించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
ఈ మేరకు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో బండి సంజయ్ ను జైలులో విచారించాలని సిట్ భావిస్తోంది.అయితే టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.







