నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా( Dussehra ) సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హీరోయిన్ గా ఈ సినిమా లో కీర్తి సురేష్( Keerthy Suresh ) నటించిన విషయం తెల్సిందే.
దసరా సినిమా చిత్రీకరణ సమయం నుండే అంచనాలు భారీగా పెంచే విధంగా వ్యాఖ్యలు చేశారు.అంతే కాకుండా నాని ఫ్యాన్స్ లో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెంచారు.
పైగా ఈ సినిమా ను పాన్ ఇండియా మూవీ అంటూ ప్రచారం చేయడం జరిగింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
కానీ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిరాశ పర్చింది.కనుక ఈ సినిమా ను పాన్ ఇండియా మూవీ అన్నట్లుగా కాకుండా తెలుగు సినిమా మాత్రమే అన్నట్లుగా ప్రమోషన్ చేసి ఉంటే బాగుండేది.
ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అన్నారు కదా ఏమైంది పరిస్థితి అంటూ కొందరు విమర్శిస్తున్నారు.కంటెంట్ ఉంటే పాన్ ఇండియా మార్కెట్ కు వెళ్లాలి కాని ఏది పడితే అది పాన్ ఇండియా సినిమా అంటే ఇలాగే ఉంటుంది అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.
ఇప్పటి వరకు దసరా సినిమా కు ఉత్తర భారతం లో మినిమం కలెక్షన్స్ నమోదు అవ్వడం లేదు.ఇక అక్కడ నుండి వసూళ్లు వస్తాయి అనే నమ్మకం కూడా లేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు పాన్ ఇండియా మూవీ అంటూ ప్రచారం చేయడం లేదు.కనుక దసరా సినిమా ను మొదటి నుండి కూడా పాన్ ఇండియా మూవీ అన్నట్లుగా కాకుండా నార్మల్ గానే ప్రచారం చేసి ఉంటే బాగుండేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నాని మరియు కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా అయినా కూడా తమిళంలో( Tamil ) ఈ సినిమా మినిమం వసూళ్లు చేయలేక పోయింది.
తెలుగు రాష్ట్రాల్లో మినహా మరెక్కడ కూడా దసరా సినిమా సందడి లేదు.కీర్తి సురేష్ వల్ల తమిళనాట అయినా వసూళ్లు నమోదు అవుతాయేమో అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేశారు కానీ సాధ్యం కాలేదు.