ఈ మధ్య కాలంలో రాహుల్ సిప్లిగంజ్ పేరు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో మారుమ్రోగిందనే సంగతి తెలిసిందే.నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ రావడంలో రాహుల్ సిప్లిగంజ్( Rahul Sipligunj ) కృషి సైతం ఉందనే సంగతి తెలిసిందే.
నాటు నాటు సాంగ్ పాడటానికి రాహుల్ సిప్లిగంజ్ 3 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారు.రాహుల్ సిప్లిగంజ్ కు వరుసగా ఆఫర్లు వస్తుండగా కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.
కెరీర్ పరంగా ఎంత ఎదిగినా సింపుల్ గా ఉండటానికి రాహుల్ సిప్లిగంజ్ ఇష్టపడతారు.అయితే రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్3( Bigg Boss ) తెలుగు విన్నర్ అనే సంగతి తెలిసిందే.
ఈ షోకు విజేతగా నిలవడం రాహుల్ కు ప్లస్ అయింది.అయితే బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి( Punarnavi )తో సన్నిహితంగా మెలిగిన సంగతి తెలిసిందే.
అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాహుల్, పునర్నవి ఎక్కడా కలిసి కనిపించలేదు.

ఈ మధ్య కాలంలో రాహుల్ సిప్లిగంజ్ అషురెడ్డితో తరచూ కనిపించడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.అయితే కొన్నిరోజుల క్రితం పునర్నవి ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కాగా ఆ వార్తల గురించి పునర్నవి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.ఈ వార్తల గురించి స్పందించాలని రాహుల్ సిప్లిగంజ్ ను కోరగా ఛీఛీ నన్నెందుకు ఇరికిస్తారు అంటూ రాహుల్ సిప్లిగంజ్ కామెంట్లు చేయడం గమనార్హం.

నేను, పునర్నవి ఎవరి దారిని వాళ్లు చూసుకున్నామని ఎప్పుడో ఒకసారి నేను, పునర్నవి మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చారు. అషురెడ్డి ( Ashu Reddy )ఎంతోమందికి సహాయం చేస్తుందని తను నా బెస్ట్ ఫ్రెండ్ అని మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి మాకు తెలుసని ప్రతిసారి ఇంతకు మించి చెప్పలేనని రాహుల్ సిప్లిగంజ్ కామెంట్లు చేశారు.రాహుల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







