వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నిరుద్యోగులతో ముఖాముఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేశాయని షర్మిల ఆరోపించారు.ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ మాట తప్పారన్నారు.
రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ ఇవ్వలేదని విమర్శించారు.రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.టీ -సేవ్ ఫోరం ఏర్పాటు చేసి ఉద్యమం చేస్తామని వెల్లడించారు.
ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం అన్ని పార్టీల మద్దతు కోరుతామన్నారు.ఈ మేరకు ఎల్లుండి డిప్యూటీ కలెక్టర్లకు వినతిపత్రం అందిస్తామని పేర్కొన్నారు.
అదేవిధంగా ఈనెల 8న రిలే దీక్షలు, 9ప దిష్టి బొమ్మలు దహనం చేస్తామని పేర్కొన్నారు.ఈనెల 10న టీ-సేవ్ ఫోరం సమావేశం నిర్వహించి, 12న కాగడాల ప్రదర్శన కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు.







