ప్రతి యేటా ఏప్రిల్ 14ని జాతీయ సిక్కు దినోత్సవంగా గుర్తించాలని కోరుతూ ద్వైపాక్షిక చట్టసభ సభ్యుల బృందం అమెరికా ప్రతినిధుల సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.కాంగ్రెస్ మహిళ మేరీ గే స్కాన్‌లాన్( Mary Gay Scanlon ) ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
దేశ సాంఘిక నిర్మాణాన్ని సమర్ధించడంలో , సుసంపన్నం చేయడంలో సిక్కు సమాజం కీలకపాత్ర పోషిస్తోందని ఆమె తీర్మానంలో అన్నారు.నిరంకుశత్వం, అణచివేతకు వ్యతిరేకంగా పదవ సిక్కు గురువు ద్వారా 1699లో ఆర్డర్ ఆఫ్ ఖల్సా ఫెలోషిప్‌ను( Khalsa Fellowship ) స్థాపించారని ఆమె గుర్తుచేశారు.
ప్రపంచవ్యాప్తంగా వున్న సిక్కులతో కలిసి వైశాఖీని జరుపుకోవడంతో పాటు సిక్కు సమాజం అమెరికాకు చేసిన సేవలను గౌరవించాల్సి వుందని మేరీ గే స్కాన్‌లాన్ పేర్కొన్నారు.కాగా.
గతేడాది మార్చిలోనూ ఏప్రిల్ 14ని జాతీయ సిక్కు దినోత్సవంగా గుర్తించాలంటూ భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి( Raja Krishnamurthy ) సహా డజనుకు పైగా చట్టసభ సభ్యులు అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

100 ఏళ్ల కిందటే అమెరికాకు వలస రావడం ప్రారంభించిన సిక్కు కమ్యూనిటీ.దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిందని వారు తీర్మానంలో తెలిపారు.అలాంటి సిక్కు కమ్యూనిటీని గౌరవించుకునేందుకు గాను ‘‘జాతీయ సిక్కు దినోత్సవం’’( National Sikh Day ) కోసం ఈ తీర్మానం మద్ధతు ఇస్తుందని వారు పేర్కొన్నారు.
కాంగ్రెస్ మహిళ మేరీ గే స్కాన్‌లాన్ ఈ తీర్మానాన్ని స్పాన్సర్ చేశారు.దీనికి కరెన్ బాస్, పాల్ టోంకో, బ్రియాన్ కె ఫిట్జ్‌పాట్రిక్, డేనియల్ మీసర్, ఎరిక్ స్వాల్‌వెల్, రాజా కృష్ణమూర్తి, డోనాల్డ్ నార్‌క్రాస్, ఆండీ కిమ్ , జాన్ గారామెండి, రిచర్డ్ ఈ నీల్, బ్రెండన్ ఎఫ్ బాయిల్, డేవిడ్ జి వలదావోలు మద్ధతు తెలిపారు.
వీరిలో జాన్ గరామెండి, డేవిడ్ వలదావోలు సిక్కు కాకస్‌కు సహ-అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.ఈ తీర్మానాన్ని సిక్కు కాకస్ కమిటీ, సిక్కు సమన్వయ కమిటీ, అమెరికన్ సిక్కు గురుద్వారా పర్బంధక్ కమిటీలు స్వాగతించాయి.

కాగా.15వ శతాబ్ధంలో అవిభక్త భారత్‌లోని పంజాబ్‌లో( Punjab ) సిక్కు మతం పుట్టింది.నేడు ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్లకు పైగా ప్రజలు ఈ మతాన్ని అనుసరిస్తున్నారు.అధికారిక గణాంకాల ప్రకారం.5,00,000 మంది సిక్కులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్నారని అంచనా.అగ్రరాజ్యం తర్వాత ఆస్ట్రేలియా, కెనడా, యూకేలలో పెద్ద సంఖ్యలో సిక్కులు స్థిరపడ్డారు.







