బ్లాక్ బస్టర్ హిట్లను సాధించి కార్లను అందుకున్న స్టార్ డైరెక్టర్లు వీళ్లే!

నిమా ఇండస్ట్రీలో సక్సెస్ డైరెక్టర్లు హీరోల కెరీర్ కు సంబంధించి కీలక పాత్ర పోషిస్తుంది.సక్సెస్ లో ఉన్నవాళ్లకు భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ ను ఆఫర్ చేయడం జరుగుతుంది.

 These Blockbuster Directors Got Cars As Gift Srikanth Odela Om Raut Koratala Siv-TeluguStop.com

తాజాగా దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు( Director Srikanth Odela ) దసరా నిర్మాత కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ విధంగా గతంలో కూడా కార్లను అందుకున్న డైరెక్టర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

సూపర్ హిట్ సాధించి ఖరీదైన కార్లను చాలామంది బహుమతిగా పొందుతున్నారు.

దసరా డైరెక్టర్ కు నిర్మాత ఇచ్చిన కారు విలువ 80 లక్షల రూపాయలు అని సమాచారం అందుతోంది.

శ్రీమంతుడు మూవీతో కొరటాల శివ సక్సెస్ సాధించిన సమయంలో 50 లక్షల రూపాయల విలువైన ఆడి ఏ6 కారు బహుమతిగా దక్కింది.విక్రమ్ మూవీ సక్సెస్ సాధించడంతో దర్శకుడు లోకేశ్ కనగారాజ్ కు( Lokesh Kanakaraj ) ఖరీదైన కారు బహుమతిగా దక్కింది.

ఆ సినిమాకు పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు బైక్స్ బహుమతిగా దక్కాయి.

సింగర్ డైరెక్టర్ హరికి స్టార్ హీరో సూర్య ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వడం జరిగింది.దర్శకుడు ఓం రౌత్ కు( Director Om Raut ) లగ్జరీ ఫెరారీ ఎఫ్‌ 8 ట్రిబ్యుటో కారును టీ సిరీస్ అధినేతలు బహుమతిగా ఇవ్వడం జరిగింది.హీరో కిచ్చా సుదీప్ రారా రక్కమ్మ సాంగ్ కొరియోగ్రఫీని మెచ్చి 20 లక్షల రూపాయల ఖరీదైన థార్ కార్ ను బహుమతిగా ఇవ్వడం జరిగింది.

భలే భలే మగాడివోయ్ సినిమాకు మారుతికి కూడా కారు బహుమతిగా దక్కింది.

ఉప్పెన మూవీ సక్సెస్ తో ఆ మూవీ

డైరెక్టర్ బుచ్చిబాబుకు

కూడా కారు గిఫ్ట్ గా దక్కింది.భీష్మ మూవీ సక్సెస్ తో ఆ మూవీ దర్శకుడు వెంకీ కుడుములకు కారు దక్కింది.ఈ డైరెక్టర్లు తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube