ఛలో, భీష్మ, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఎవ్వరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈమె ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది.
ఒకవైపు పుష్ప సీక్వెల్ లో నటిస్తూనే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.మొన్నటి వరకు బాలీవుడ్ సినిమాల మీదనే ద్రుష్టి పెట్టింది.
అయితే ఈ అమ్మడికి అక్కడ కలిసి రానట్టే అనిపిస్తుంది.దీంతో ఇప్పుడు మళ్ళీ సౌత్ సినిమాల్లో నటించేందుకు సిద్ధం అవుతుంది.అందుకు అనుగుణంగానే వరుస సినిమాలకు సైన్ చేస్తూ ఈ అమ్మడు మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళుతుంది.ఇక తమిళ్-తెలుగు ఫాంటసీ డ్రామా రెయిన్ బో లో ఈమె నటిస్తుంది.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలో డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నిన్ననే హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె మరో మూవీ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.తమిళ్ మీడియా నుండి వస్తున్న సమాచారం ప్రకారం లవ్ టుడే వంటి సినిమాను తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న యువ నటుడు, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) నెక్స్ట్ సినిమాలో రష్మిక ప్రధాన పాత్రలో నటించ బోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.ఇది ఓకే అయితే మరో తమిళ్ మూవీ అమ్మడి చేతిలో ఉన్నట్టే.

ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మిథున్ (Director Midhun) అనే యువ డైరెక్టర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్టు టాక్.అధికారిక వివరాలు త్వరలోనే వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాలతో పాటు ఇటీవలే తెలుగులో ఛలో, భీష్మ వంటి సినిమాలను డైరెక్ట్ చేసి ఈ అమ్మడికి బ్లాక్ బస్టర్ అందించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పింది.VNRTrio పేరుతో అఫిషియల్ గా ప్రకటించిన ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు.
త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది.







