రాజకీయాల్లో ప్రత్యర్థిలపై పైచేయి సాధించేందుకు వ్యూహాలు తప్పనిసారి అని.తాను ఏం చేసిన పక్కా వ్యూహాత్మకంగానే ఉంటుందని పదే పదే చెప్పే పవన్ ( Pawan Kalyan ) తాజాగా వ్యవహరిస్తున్న తీరుతో ఆయన ఏ వ్యూహంతో ముందుకు వెళ్లబోతున్నారనేది ఇప్పుడు ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా సాగుతున్న చర్చ.
మొదటి నుంచి కూడా బీజేపీ ( BJP ) మిత్రపక్షంగానే ఉంటువచ్చిన పవన్.అవసరమైతే బీజేపీ దోస్తీకి కటిఫ్ చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయనే సంకేతాలను కూడా ఇచ్చారు.
పవన్ బీజేపీకి దూరమై టీడీపీకి ( TDP ) దగ్గరవుతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి.దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షం అయిన బీజేపీకి పవన్ ఏమాత్రం మద్దతు తెలుపలేదు.
కనీసం బీజేపీ తరుపున ఓటు వేయండి అని కూడా కోరలేదు.
దీంతో కమలనాథులు పవన్ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్ళగక్కారు.
దీంతో జనసేన బీజేపీ మద్య దూరం పెరుగుతున్న సంకేతాలు కనిపించాయి.కానీ అనూహ్యంగా పవన్ తాజాగా డిల్లీలోని బీజేపీ పెద్దలతో బేటీ అయ్యారు.
అది కూడా జగన్ డిల్లీ పర్యటన ముగిసిన వెంటనే పవన్ డిల్లీ పెద్దలతో భేటీ కావడం కాస్త చర్చనీయాంశం అయింది.బీజేపీ జాతీయ అద్యక్షుడు నడ్డాతో భేటీ అయిన పవన్.
ఆయనతో ఏం చర్చించారు ? ఎలాంటి ప్రతిపాదనలు నడ్డా ముందుంచారు ? నడ్డా పవన్ కు ఏం సూచించారు ? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తెగ చక్కర్లు కొట్టాయి.
అయితే అనంతరం మీడియాతో మాట్లాడినా పవన్ భేటీలోని విషయాలపై పెద్దగా స్పందించలేదు.అధికారం సాధించేందుకు ఏం చేయాలో చేర్చించమని ఈ భేటీ సత్ఫలితాలను ఇస్తుందని మాత్రమే చెప్పుకొచ్చారు.దీంతో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గురించి పవన్ నడ్డా వద్ద ప్రస్తావించారా ? అనే చర్చ జరుగుతోంది.బీజేపీ టీడీపీని కలపాలని పవన్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు.కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం టీడీపీతో కలిసేందుకు ససేమిరా అంటున్నారు.దీంతో పవన్ ఎటు వెళ్లాలో అర్థంకాని సందిగ్ధంలో ఉండిపోయారు ఇన్నాళ్ళు.
అయితే అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పుంజుకోవడంతో టీడీపీతో కలవడం తప్పా వేరే దారి లేదని పవన్ బీజేపీ హైకమాండ్ తో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.డిల్లీ పెద్దలు కూడా టీడీపీతో కలవడంపై పునఃఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ టీడీపీ, బీజేపీ కలిసేందుకు బీజేపీ సిద్దమైతే పవన్ వ్యూహం ఫలించినట్లేనని రాజకీయ వాదాలు చెబుతున్నారు.
ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటును చిలనివ్వమని పదే పదే చెబుతున్నా పవన్.కూటమితో వైసీపీని గట్టిగానే చెక్ పెట్టె అవకాశం ఉంది.మరి టీడీపీ, జనసేన, బీజేపీ, దోస్తీ పై మరింత క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్లు ఎదురు చూడక తప్పదు.