భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న హృతిక్ రోషన్( Hrithik Roshan ) ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు.హృతిక్ రోషన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నారు.
తాజాగా హృతిక్ చేతిలో లవర్ చెప్పులు పట్టుకుని కనిపించడం హాట్ టాపిక్ అవుతోంది.ఏంటి బ్రో ఇదీ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఈ ఘోరం చూడలేమంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరి కొందరు నెటిజన్లు అయితే ఏకంగా హృతిక్ రోషన్ మగవాళ్ల పరువు తీస్తున్నాడంటూ కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.హృతిక్ రోషన్ తన ప్రేయసి, సింగర్ అయిన సబా ఆజాద్( Saba Azad ) తో కలిసి నీతా అంబానీ( Nita Ambani ) కల్చరల్ సెంటర్ కు హాజరు కావడం జరిగింది.
కొంతమంది మాత్రం హృతిక్ రోషన్ సింప్లిసిటీకి నిదర్శనం అని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

సబా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తో ఫోటో దిగుతున్న సమయంలో హృతిక్ వెనుక చెప్పులు పట్టుకుని కనిపించారు.ఈ ఘటన గురించి హృతిక్ రోషన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.అబ్బాయిలు దయచేసి అతనిని గమనించాలని హృతిక్ రోషన్ ఉత్తమ ప్రియుడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
హృతిక్ రోషన్ 2000 సంవత్సరంలో సుజానే ఖాన్ ( Suzanne Khan )ను పెళ్లి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.

అయితే మనస్పర్ధలు రావడంతో 2014లో హృతిక్ సుజానే ఖాన్ తో విడిపోవడం జరిగింది.ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.విడాకుల తర్వాత హృతిక్ రోషన్ సబాతో సన్నిహితంగా మెలిగారు.
హృతిక్ రోషన్ కెరీర్ పై సరిగ్గా దృష్టి పెడితే సక్సెస్ ట్రాక్ లోకి రావడం కష్టం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







