చిరుత( cheetah ).ఈ పేరు వినగానే మనకు వేగమే గుర్తుకొస్తుంది.
ఎందుకంటే సన్నగా, అత్యంత శక్తివంతంగా ఉండే ఈ మృగం కన్ను మూసి తెరిచేలోగా మాయమవుతుంది.ఇది రెప్పపాటు సమయంలో తల్లి నుంచి పిల్లను వేరు చేస్తుంది.
గ్రద్ద ఎత్తుకుపోయినట్టు ఇది తన ఎరను వాయువేగంతో ఎత్తుకు పోతుంటుంది.దీని వేట చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
కాగా తాజాగా ఒక చిరుత గేదెల ( buffalo )మందలోకి పరుగెత్తి, దాని నోట ఒక దూడను కరచుకుని క్షణాల్లోనే అక్కడి నుంచి పారిపోయింది.దీనికి సంబంధించి వెన్నులో వణుకు పుట్టించే ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో కొన్ని కార్లు ( Cars )ఒక రహదారిపై ఆగి ఉండటం చూడవచ్చు.వాటి ముందు ఒక గేదెల మంద ఉంది.ఇంతలోనే అటువైపుగా చెట్ల పొదల్లో నుంచి వచ్చిన చిరుత చిన్న దూడ మెడను నోట కరుచుకొని శరవేగంగా దూసుకెళ్లింది.ఒక్కసారిగా ఆ చిరుత తన బిడ్డపై పడి ఎత్తుకెళ్లడంతో అక్కడే ఉన్న తల్లి గేదె ఖంగు తిన్నది.
తల్లి పక్కనే అప్పటిదాకా ఎంతో సురక్షితంగా ఉన్న ఆ దూడ తన మెడను చిరుత గట్టిగా కొరికేస్తూ, లాగేస్తూ తీసుకెళ్లడంతో ఆర్తనాదాలు పెట్టింది.ఈ దృశ్యం చూసి తల్లి గేదె తల్లడిల్లింది.
తన బిడ్డను విడిపించుకోవడానికి చిరుతను వెంటాడింది.తర్వాత ఏం జరిగిందో వీడియోలో కనిపించలేదు.

ఒక కారులో కూర్చున్న వ్యక్తి ఈ వేటకు సంబంధించిన దృశ్యాలను రికార్డ్ చేశాడు.వైల్డ్‌లైఫ్ స్టోరీస్( Wildlife Stories ) అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ దీనిని షేర్ చేసింది.“గేదెపై చిరుతపులి దాడి చేసింది” అనే క్యాప్షన్‌ను జోడించింది.దీన్ని చూసిన నెటిజన్లు అయ్యో పాపం అంటున్నారు.
దాన్ని తరిమేసి దూడను కాపాడేందుకు ప్రయత్నించిన గేదెలను మరికొందరు ప్రశంసిస్తున్నారు.ఈ చావు బతుకుల పోరాటం ఎప్పుడూ జరిగేదే కానీ చూసేందుకు ఇది హార్ట్ బ్రేకింగ్‌గా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.“చావు బతుకుల పోరాటం ఇది.దూడ తన జీవితం కోసం పోరాడుతోంది.చిరుతపులి ఆకలితో పోరాడుతోంది.” అని ఒక యూజర్ కామెంట్ చేశారు.ఈ వీడియోను మీరూ చూసేయండి.







