సమర సింహారెడ్డి( Samarasimha Reddy ) వంటి ఒక ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.ఈ సినిమాలో యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా బలంగా ఉంటుంది.
అందుకే ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.ఈ చిత్రానికి ముందు ఎన్నో వరుస పరాజయాలను ఎదుర్కొన్న బాలకృష్ణకు( Balakrishna ) సమర సింహారెడ్డి చిత్రం ఒక మైలురాయి వంటిది.
ఆయన కెరియర్ ను ఒక మలుపు తిప్పింది.ఈ చిత్రం తర్వాతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ నేపథ్యమున్న అనేక సినిమాలు తెలుగు తెరపై వచ్చాయి.
అంతే కాదు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టడం ప్రారంభమైంది.
అయితే మిగతా చాలా మంది హీరోల కంటే కూడా బాలకృష్ణకే ఫ్యాక్షన్ కథలు బాగా సూట్ అవుతాయి.
ఈ చిత్రం తర్వాత ఆయన నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి వంటి ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమాలను తీసి కెరియర్ లోనే బెస్ట్ చిత్రాలను తీశాడు.ఇక సమర సింహారెడ్డి సినిమా గురించి బాలకృష్ణ ఎన్నో సందర్భాల్లో చెబుతూ వస్తున్నాడు.
ఎంతో సెంటిమెంట్ ఉన్నటువంటి ఈ చిత్రం ముగ్గురు అక్కాచెల్లెలను కాపాడే అన్న పాత్రలో బాలకృష్ణ కనిపించడం, వారి కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కోవడం ఈ సినిమాలో మంచి టర్నింగ్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు.ఇక బాలకృష్ణకు అక్కాచెల్లెళ్లుగా నటించినా ముగ్గురు అమ్మాయిల్లో దివ్యాంగురాలు పాత్రలో నటించిన సరస్వతి ( Saraswatu ) అనే అమ్మాయి మీకు గుర్తుందా ?
ఆమె రైల్వే ట్రాక్ లో బాలకృష్ణ కాలు చిక్కుకోవడంతో పరిగెత్త లేక ఇబ్బంది పడుతూ ఉంటే బాలకృష్ణ మొటివేట్ చేయడంతో ఆమె కాలు తిరిగివస్తుంది.ఈ సీన్ సమరసింహారెడ్డి సినిమాకి ఒక హైలెట్ పాయింట్ గా నిలిచింది.ఇక ఈ సరస్వతి పాత్రలో నటించిన అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే అస్సలు నమ్మరు.
ఆమె పేరు సహస్ర ( Sahasra ) ఇప్పుడు గుర్తు పట్టకుండా మారిపోయింది.భాను చందర్ ఉద్యమం సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది.ముగ్గురు మొనగాళ్లు, మేజర్ చంద్రకాంత్, హిట్లర్, రౌడీ అల్లుడు వంటి చిత్రాల్లో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా 100 సినిమాల్లో కనిపించింది.ఆమె చివరిగా నటించిన సినిమా సమరసింహారెడ్డి.
కేవలం చదువు పాడవుతుందని ఒకే ఒక కారణంతో సినిమాల నుంచి పక్కకు తప్పుకుందట.ఈ చిత్రం తర్వాత ఆమె మళ్ళీ ఎక్కడా కనిపించలేదు.అయితే ఇటీవల కాలంలో ఒక మీడియా సంస్థకు సహస్ర ఇంటర్వ్యూ ఇస్తూ అనేక ఆసక్తికరమైన విషయాలను తన అభిమానులతో పంచుకున్నారు.చిన్నతనంలో మెగా ఫ్యామిలీ ఇంటికి ఎప్పుడు వెళ్లే సహస్ర రామ్ చరణ్ తో కలిసి .ఆటలు ఆడుకునేదట.ఇక మోహన్ బాబుతో కూడా మంచి అనుబంధము ఉండేదట.
వారింటికి కూడా తరచుగా వెళ్లేదట సహస్ర మంచు మనోజ్ తో సెట్స్ లో చాలా ఆటలు ఆడుకునేదట.అయితే చిన్నప్పుడు ఎంతో ముద్దుగా ఉన్న సహస్ర ఇప్పుడు కాస్త బొద్దుగా మారింది.
తను ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా కూడా చెప్పింది.