రష్యా-ఉక్రెయిన్( Russia-Ukraine ) మధ్య యుద్ధ వాతావరణం నానాటికీ పెరుగుతోంది.నిత్యం ఒకరిదేశంలో మరో దేశం విధ్వంసాలకు పాల్పడుతున్నాయి.
ముఖ్యంగా బలమైన సైనిక సంపత్తి ఉన్న రష్యా( Russia ) తన వద్ద ఉన్న ఆయుధాలన్నింటినీ ఉక్రెయిన్ పై ప్రయోగిస్తుంది.ఇతర దేశాల సాయంతో ఉక్రెయిన్( Ukraine ) కూడా ధైర్యంగా పోరాడుతోంది.
ఈ తరుణంలో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని నెవా నది ఒడ్డున ఉన్న ఒక కేఫ్‌లో ఇటీవల పేలుడు జరిగింది.
అందులో ప్రముఖ సైనిక వార్ బ్లాగర్ వ్లాడ్లెన్ టాటార్స్కీ మరణించాడు.దీనిపై రష్యా భగ్గుమంది.దీనిని ఉగ్రవాదుల కుట్రగా అభివర్ణించింది.
కేఫ్‌లో పేలుడు సంభవించిన సంఘటనకు సంబంధించి రష్యా పోలీసులు సోమవారం దరియా ట్రోపోవా అనే మహిళను అరెస్టు చేశారు.ఆమెకు కేఫ్‌లో బాంబు పేలుడుకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ఈ పేలుడులో సుమారు 30 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.రష్యన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం, టార్స్కి తన మద్దుతుదారులతో ఆ కేఫ్ లో సమావేశం పెట్టుకున్నారు.
అదే సమయంలో బాంబు పేల్చి, చంపేశారు.ఈ కేసులో ఓ మహిళను అరెస్టు చేసినట్లు రష్యా టాప్ క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఏజెన్సీ ఏజెన్సీ ‘రసియన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ’ ప్రకటించింది.
ఇరవై ఆరు సంవత్సరాల ట్రైపోవా సెయింట్ పీటర్స్బర్గ్ నివాసి.
యుద్ధ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్నందుకు ఇంతకు ముందు ఆమెను అరెస్టు చేశారు.విచారణలో ఆమె కేఫ్ దగ్గరకు ఒక విగ్రహాన్ని తీసుకువచ్చింది.దానిని వ్లాడ్లెన్ టాటార్క్సీ సమీపంలో ఉంచింది.
ఆ తరువాత పేలుడు సంభవించింది.ఈ దాడికి ఏ సమూహమూ బాధ్యత తీసుకోలేదు.
ఇక చనిపోయిన టాటర్స్కీ అసలు పేరు మాగ్జిమ్ ఫోమిన్.అతనికి టెలిగ్రామ్‌లో 560,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.అతను ప్రముఖ సైనిక వ్యవహారాల బ్లాగర్లలో ఒకడు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి పలుమార్లు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు.