నాని( Nani ) హీరోగా నటించిన దసరా( Dussehra ) సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చిత్ర యూనిట్ సభ్యులు కాస్త ఎక్కువ పబ్లిసిటీ చేయడం జరిగింది.
కేజీఎఫ్.పుష్ప సినిమాల స్థాయి లో పాన్ ఇండియా లో సూపర్ హిట్ అవుతుందని అంతా భావించారు.
కానీ సినిమా పాన్ ఇండియా స్థాయి లో చేతులు ఎత్తేసినట్లుగా అనిపిస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు నమోదు చేస్తూ ఉన్న దసరా సినిమా తెలుగేతర భాషల్లో మాత్రం మినిమం ఓపెనింగ్స్ ను రాబట్టలేక పోయింది.
మరీ ఇంత తక్కువ వసూళ్లు అక్కడ నమోదు అవుతాయని ఏ ఒక్కరు ఊహించలేదు.పుష్ప మరియు కేజీఎఫ్ సినిమా లు అక్కడ వందల కోట్లు వసూళ్లు చేయడం జరిగింది.
కానీ దసరా సినిమా మాత్రం ఏమాత్రం ఆకట్టుకోక పోవడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.దసరా సినిమా కు ఎందుకు కేజీఎఫ్( KGF ) మరియు పుష్ప( Pushpa ) సినిమా ల స్థాయి లో వసూళ్లు నమోదు అవ్వడం లేదు.
మేకింగ్ విషయంలో తప్పు జరిగిందా లేదంటే ప్రమోషన్ విషయంలో తప్పు జరిగి ఉంటుందా అంటూ చాలా మంది చర్చించుకుంటున్నారు.

హీరోగా నాని కి అక్కడ మంచి క్రేజ్ లేదు.ఆ కారణం వల్ల కూడా దసరా సినిమాను జనాలు అక్కడ పట్టించుకోవడం లేదు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మొత్తానికి కేజీఎఫ్ సినిమా మరియు పుష్ప సినిమా లు చాలా స్పెషల్ అంటూ దీంతో మరోసారి నిరూపితం అయింది.
ఆకట్టుకునే కథ మరియు కథనంతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) ఈ సినిమాను రూపొందించారు అంటూ రివ్యూలు వచ్చాయి.కానీ అక్కడ మాత్రం దర్శకుడి యొక్క మ్యాజిక్ పని చేయలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
పాన్ ఇండియా రేంజ్ లో మంచి వసూళ్లు చేసి ఉంటే కచ్చితంగా పుష్ప మరియు కేజీఎఫ్ స్థాయి విజయాన్ని దసరా దక్కించుకుని ఉండేది.కానీ అక్కడ దసరా సినిమాకు ఆశించిన స్థాయి లో కలెక్షన్స్ నమోదు కాలేదు.







