కరేబియన్ దేశాలపై భారత్ ఫోకస్ .. నెలాఖరులో గయానా, డొమినికన్ రిపబ్లిక్‌లలో జైశంకర్ పర్యటన

భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్( S Jaishankar ) ఈ నెలాఖరులో గయానా , డొమినికన్ రిపబ్లికన్‌లలో పర్యటించనున్నారు.గయానా-భారత్ సంబంధాలు మరింత మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ పర్యటను చేయనున్నారు.

 Mea S Jaishankar To Visit To Guyana, Dominican Republic This Month , Mea S Jaish-TeluguStop.com

ఈ ఏడాది గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ( Irfan Ali ), ఉపాధ్యక్షుడు డాక్టర్ భరత్ జగ్దేయో( Dr.Bharat Jagdeo ), గయానా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బ్రిగేడియర్ గాడ్ ఫ్రే బెస్‌లు భారత్‌లో పర్యటించారు.గయానా నుంచి భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది.అక్కడ 3,27,000 మంది పైనే భారత సంతతి వ్యక్తులు స్థిరపడ్డారు.

Telugu Caribbean, Guyana, Indiadominican, Irfan Ali, Mea Jaishankar, Rahul Gandh

బ్రిటీష్ పాలనా కాలంలో భారతీయులు గయానాకు ఎక్కువగా వలస వెళ్లారు.మనదేశంలోని ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర ప్రాంతాల నుంచి అక్కడికి ఉపాధి నిమిత్తం వెళ్లారు.నిజానికి ఆ దేశాధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ భారత మూలాలున్నవారే.ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో జరిగిన ప్రవాసీ భారతీయ సమ్మేళన్‌లో పాల్గొనాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది.భారత్ నుంచి డిఫెన్స్ ఫ్లాట్‌ఫాంలను పొందడానికి గయానా ఆసక్తితో వుంది.అలాగే రక్షణ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి.

Telugu Caribbean, Guyana, Indiadominican, Irfan Ali, Mea Jaishankar, Rahul Gandh

ఇకపోతే.డాక్టర్ జైశంకర్ పర్యటనలో కరేబియన్ ప్రాంతంతో న్యూఢిల్లీ మరింత అనుబంధాన్ని పెంచుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ క్రమంలో విదేశాంగ మంత్రి డొమినికన్ రిపబ్లిక్ పర్యటన కూడా కీలకంగా మారనుంది.భారత్-డొమినికన్ రిపబ్లిక్ మధ్య దౌత్య సంబంధాలు మే 1999లో ఏర్పడ్డాయి.ప్రస్తుతం అక్కడ 200 మంది వరకు భారతీయ పౌరులు, భారత సంతతికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు.గతంతో పోలిస్తే .కరేబియన్ ప్రాంతంతో ఇటీవలికాలంలో భారతదేశ సంబంధాలు బలోపేతమవుతున్నాయి.ఈ ప్రాంతంతో ఆర్ధిక, రాజకీయ సంబంధాలను మరింతగా పెంచుకోవాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

మరోవైపు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) అనర్హతపై పాశ్చాత్య దేశాలు స్పందించడంపై జైశంకర్ మండిపడ్డారు.

ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పాశ్చాత్య దేశాలకు వున్న ఓ దురలవాటని ఆయన చురకలంటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube