నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారని,వామక్షాలతో పొత్తు విషయంలో ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైతేనే ఉంటుందని,మునుగోడు కలిసి పని చేశామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఎమ్మెల్యే భాస్కర్ రావుతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే భాస్కర్ రావు బ్రహ్మాండంగా పని చేస్తున్నారని,రానున్న ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధిస్తారన్న విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ ఫ్యామిలీని అప్రదిష్టపాలు చేయాలనే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల్లో కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపణలు చేస్తున్నారన్నారు.ఎలాంటి పైరవీలకు,అనుమానాలకు స్థానం లేకుండా టీఎస్పీఎస్సీ ఓరల్ మార్క్స్,ఇంటర్వ్యూలను తీసేసిందని గుర్తు చేశారు.
టీఎస్ పీఎస్సీలో ఎవరో నలుగురు చేసిన తప్పులను సాకుగా చూపి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆలస్యం చేసి నిరుద్యోగులకు సమస్యలను తీసుకరావద్ధని ప్రతిపక్షాలకు సూచించారు.
ఎన్నికల ఏడాది ప్రభుత్వంపై బురద జల్లుతున్న విషయం ప్రజలు గుర్తించాలన్నారు.
దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనపై ప్రభుత్వం సరైన చర్యలు చేపడుతోందని,వచ్చే నెల నుంచే కొన్ని ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టిందని,విపక్షాల వలలో పడవద్ధని నిరుద్యోగులను కోరారు.లొసుగులు,లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సిద్ధమైందని,పార్టీలకు అతీతంగా సహకరించాలన్నారు.
మునుగోడులో వామపక్షాలతో కలిసి పని చేసినంత మాత్రన ఇక్కడ కూడా కలిసి పని చేయాలని లేదని,ఇరు పక్షాలకు కలవాలని ఉంటే కలిసి పనిచేస్తామన్నారు.తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయంతో పాటు అన్ని ఇండెక్స్ ల్లో ముందు వరసలో ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ,ఐటీ సంస్థలను అడ్డుపెట్టి ప్రతిపక్షాల గొంతును నొక్కేస్తోందని, కేంద్రం గవర్నర్ వ్యవస్థను నీరుగార్చిందని ఆరోపించారు.కేంద్రం విభజన చట్టాలను, కృష్ణా,గోదావరి జలాల వాటాల సమస్యల పరిష్కారం విస్మరించిందన్నారు.
రాహుల్ గాంధీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు.