పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీలో లుకలుకలు బయటపడ్డాయి.వైసీపీ నేత విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వైసీపీ మనుగడ కోల్పోతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
వైసీపీ కార్యకర్తలను పట్టించుకునే నాథుడే లేడంటూ విజయభాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.
ఈ నేపథ్యంలోనే ప్రజా సమస్యలపై జూన్ 24 వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో పర్యటిస్తానని తెలిపారు.ప్రజలు సహకరిస్తే రానున్న ఎన్నికల్లో అధిష్టానంతో పోరాడి సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు.
నాయకుడు అంటే ప్రజల నుంచి పుట్టుకు రావాలని తెలిపారు.







