ఈ దేశంలో రిజర్వేషన్ ( Reservations ) అన్నది రాజకీయ అంశం గా మారి చాలా కాలం అయింది.రాజ్యాంగ కర్త అంబేద్కర్ ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం కోసం రాజ్యాంగంలో పొందుపరచబడిన ఈ రిజర్వేషన్లు కాలక్రమమైన వాటి అసలు స్ఫూర్తిని పక్కనపెట్టి ఎన్నికల ముడి సరుకుగా మారిపోయాయి.
ఇంతకాలం నుండి రిజర్వేషన్ అమలు చేస్తున్నా ఆయా వర్గాల అబివృద్ది లో చెప్పుకోదగ్గ మార్పులు మాత్రం రాలేదు ….ప్రభుత్వాలు కూడా వారిని ఆకట్టుకోవడానికి తాత్కాలికి తాయలాలూ ఇవ్వడమే తప్ప ఆయా వర్గాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధిగా ప్రయత్నం చేసిన ప్రభుత్వాలు లేవనే చెప్పాలి.ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ల ఫలితాలను బట్టి రిజర్వేషన్లు కొనసాగించాలా వద్దా అన్నది అప్పటి ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలని అంబేద్కర్ చెప్పినప్పటికీ,

సంఖ్య బలం అధకం గా ఉన్న దళితుల వోట్ల తో ముడిపడిన అంశం కావున వాటిని టచ్ చేసే ధైర్యం ఏ ప్రభుత్వం చేయలేదు.ఒకవేళ ఏ ప్రభుత్వమైనా అలాంటి ప్రయత్నం చేసినప్పటికీ కోర్టుల్లో వాటికి చుక్కెదవుతుంది.అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం( Jagan ) కోరి తేనె తుట్టను కదుపుతుందని వార్తలు వినిపిస్తున్నాయి .జగన్ పార్టీకి ప్రధాన వోటు బ్యాంక్ అయిన ఎస్ టి , ఎస్ సి ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.బోయలన, వడ్డెరలను ఎస్సీలలో చేర్చాలని,, ఎస్సీ సామాజిక వర్గంలో దళిత క్రిస్టియన్లకు ప్రాధాన్యత కల్పించాలంటూ ఇటీవల ఏపీ అసెంబ్లీ ఒక బిల్లును ప్రవేశపెట్టింది.

ఇదే ఇప్పుడు ఆయా వర్గాలు జగన్ పై విమర్శలు వర్షం కురిపించడానికి కారణమైంది ఆయా వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా తమ రిజర్వేషన్ కు గండిపడుతుందని భావన మిగిలిన వర్గాలలో ఉంది… గడిచిన ఎన్నికలలో ఒక్క ఎస్సి రిజర్వుడ్ నియోజకవర్గంలో తప్ప మిగిలిన అన్ని ఎస్సీ, ఎస్టీ రిసర్వ్డ్ నియోజకవర్గాలలోను వైసీపీ పార్టీ .( YCP ) ఏక పక్షం గా గెలిచింది ….దానిని బట్టి ఆయా వర్గాలు ఏ స్థాయిలో జగన్ ప్రభుత్వానికి అండదండగా ఉన్నాయో అర్థమవుతుంది ….
మరి ఎన్నికల దగ్గరికి వస్తున్న ఇలాంటి సమయంలో తమ అనుకూల వర్గాల ప్రయోజనాల దెబ్బతీసే నిర్ణయాలుతీసుకోవడం అంత తెలివైన నిర్ణయం కాదని రాజకీయ వర్గాలు విశ్లేషణ చేస్తున్నాయి.మరి వస్తున్న వ్యతిరేకతను బట్టి ఈ నిర్ణయం పై వెనకంజ వేస్తారా లేదా తగ్గేదె లే అంటూ ముందుకే వెళ్తారా అన్నది చూడాలి .