జెకే సిమెంట్స్( JK Cements ) ఏమిటి? లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్( Limca Book of Records ) లోకి ఎక్కడమేమిటి అని అనుమానం వస్తుంది కదూ.మీరు విన్నది నిజమే.
జెకే సిమెంట్స్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.విషయం ఏమంటే ఒకే రోజులో రాజస్తాన్( Rajasthan ) లోని 249 పాఠశాలల్లో 249 ర్యాంప్ లను నిర్మించడం ద్వారా జేకే సిమెంట్స్ ఈ ఘనతను సాధించింది.అందుకుగాను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది.‘బనాయే హర్ రాహ్ ఆసాన్‘ (రండి ప్రతీ మార్గాన్ని సులభతరం చేద్దాం) అనే కార్యక్రమం చేపట్టిన జేకే సిమెంట్స్ ఒకే రోజులో ఈ రికార్డుని సాధించింది.
కాగా ఈ కార్యక్రమంలో మొత్తం 2 వేల మంది జేకే సిమెంట్స్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, డీలర్లు, కార్మికులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జేకే సిమెంట్స్ బ్రాండింగ్ హెడ్ లవ్ రాఘవ్ మాట్లాడుతూ… ఇదొక గొప్ప కార్యక్రమమని, సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలన్న జేకే సిమెంట్స్ విధానంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు.సమాజానికి సేవ చేయడం, దాంతో పాటు తమ బ్రాండ్ వాల్యూ పెంచుకోవడం ఈ కార్యక్రమం ఉద్దేశం అని పేర్కొన్నారు.
ఇకపోతే ఒకే రోజులో 249 స్కూల్ ర్యాంప్ ల నిర్మాణం కార్యక్రమం పూర్తిగా జేకే సిమెంట్స్ మాత్రమే నిర్వహించిందని, ఇందులో వేరే సంస్థలు, ప్రభుత్వ విభాగాల పాత్ర ఎంతమాత్రమూ లేదని జేకే సిమెంట్స్ క్లస్టర్ హెడ్ హరీశ్ ఖుషలాని పేర్కొన్నారు.జేకే సిమెంట్స్ తో ప్రత్యక్ష, పరోక్ష సంబంధమున్న 2వేల మంది కృషితో ఈ కార్యక్రమం సాధ్య పడిందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.సిమెంట్ ఉత్పత్తిలో భారత్ లోని ప్రముఖ కంపెనీల్లో జేకే సిమెంట్ ఒకటనే విషయం అందరికీ విదితమే.
అలాగే వైట్ సిమెంట్ ఉత్పత్తిలో జేకే సిమెంట్స్ ప్రపంచ అగ్రగామి సంస్థల్లో ఒకటిగా వెలుగుతోంది.