శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్ కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

బుల్లి తెర మీద జబర్దస్త్ షో( Jabardasth Show ) తో బాగా పాపులర్ అయిన వాళ్లలో సుడిగాలి సుదీర్( Sudigali Sudheer ) ఒకడు ఈయన కమెడియన్ గా ఎంత ఫేమస్ అయ్యాడో సుదీర్ రష్మి ప్రేమించుకుంటున్నారు అనే విషయం లో ఇంకా బాగా ఫేమస్ అయ్యారు…జ‌బ‌ర్ధ‌స్థ్ షో ద్వారా వీరి కెమిస్ట్రీ ఎంతో పాపుల‌ర్ అయ్యింది.సుధీర్‌, ర‌ష్మి ప్రేమ‌లో ఉన్న‌ట్లు, వారిద్ద‌రు పెళ్లిచేసుకోనున్న‌ట్లు దాదాపు పదేళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

 Would You Be Surprised To Know The Reason Sudigali Sudheer Entered Sridevi's Dra-TeluguStop.com

త‌మ అనుబంధం చాలా స్పెష‌ల్ అని చెబుతూనే ప్రేమ‌, పెళ్లి వార్త‌ల‌ను సుధీర్‌, ర‌ష్మి ఖండిస్తూ వ‌స్తోన్నారు.అయితే ఇటీవల సుధీర్ జబర్డస్త్ ప్రచారం అయ్యే ఛానెల్ కి దూరమవడంతో .సుధీర్ -రష్మీ ని జంటగా చూసే ఛాన్స్ వారి ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు.

వాస్తవానికి ఏడాది ముందు జబర్దస్త్ అంటే సుడిగాలి సుధీర్, గెటప్ శీను, హైపర్ ఆది వంటి వారే గుర్తొచ్చేవాళ్లు.

 Would You Be Surprised To Know The Reason Sudigali Sudheer Entered Sridevi's Dra-TeluguStop.com

కానీ వీరిలో కొందరు జబర్డస్త్ కామెడీ షో నుంచి దూరమయ్యారు.ప్రస్తుతం కొత్త ఆర్టిస్టులతోనే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలు నడుస్తున్నాయి.ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ ( Sridevi Drama Company ) సుడిగాలి సుధీర్ హోస్ట్ చేసినప్పుడు ఓ రేంజ్ లో ఉండేది.అయితే ప్రస్తుతం కొంత డల్ గానే సాగుతుంది.

దీంతో సోషల్ మీడియా, యూట్యూబ్‌లో ఈ షో కింద సుధీర్‌ను తీసుకురండి, సుధీర్ అన్న రావాలి వంటి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి.మరి ఇవన్నీ అలోచించి చేశారో లేక రేటింగ్ పడిపోతుందనుకున్నారో ఏంటో కానీ .చివరకు సుడిగాలి సుధీర్‌ను మళ్లీ శ్రీదేవి డ్రామా కంపెనీకి తీసుకువచ్చారు.తాజా ఎపిసోడ్ ని ఇంద్రజ హోస్ట్ చేశారు.

శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా మంది ఆర్టిస్టులు వారి జీవితంలో మార్పులు తీసుకువచ్చిన వ్యక్తులను ఈ స్టేజి మీదకు పిలిచి థాంక్స్ చెప్పబోతున్నారుఅని ఇంద్రజ అనడంతో ,, డైరెక్టర్ తేజ, ఆర్‌పీ పట్నాయక్, సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది, ఇమ్మాన్యుయేల్, మానస్, వర్ష, రష్మీ.ఇలా చాలా మంది ఎంట్రీ ఇచ్చారు .ముఖ్యంగా సుధీర్‌ను తిరిగి ఈ షోలో చూడటంపై ఆడియన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు.సుధీర్ అన్నను తీసుకువచ్చినందుకు చాలా థాంక్స్, సుధీర్ ఈజ్ బ్యాక్, టీఆర్‌పీ రేటింగ్ బ్రేక్ ఇలా కామెంట్ మొత్తం సుధీర్ గురించే ఉంది.

దీన్ని బట్టే సుధీర్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.వాస్తవానికి సుధీర్ కి హీరోగా సినిమాల్లో అవకాశాలు వస్తుండటంతో బుల్లితెరకు గుడ్‌బై చెప్పేశాడు.

Telugu Getup Seenu, Hyper, Jabardasth Show, Sridevisdrama-Latest News - Telugu

అయితే జబర్దస్త్ మానేసిన తర్వాత మరో ఛానల్ లో ఓ షో చేశాడు.ప్రముఖ ఓటీటీలో కూడా ఓ షోను చేశాడు.మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నాడు.ఇక జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎందుకు మానేశారనే ప్రశ్నకు కూడా సుధీర్ చాలా సార్లు సమాధానం చెప్పాడు.వాళ్లు ఎప్పుడు పిలిచినా రావడానికి తాను రెడీ అని చెప్పాడు.ఇక సుధీర్ రావడంతో రష్మీ తో కలసి చేయాలనీ .రష్మీ తో చేయడానికే సుధీర్ వచ్చి ఉంటాడన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube