టీడీపీ నాయకుడు నారా లోకేశ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.లోకేశ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలిపారు.
చంద్రబాబు కొడుకు అయినంత మాత్రం లోకేశ్ ను ముఖ్యమంత్రిని చెయ్యాలా అని మంత్రి సీదిరి ప్రశ్నించారు.ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు.
చంద్రబాబును సీఎం చేస్తే ప్రస్తుత పథకాలన్నీ ఆగిపోతాయని తెలిపారు.ఏపీకీ సీఎం అయ్యే అర్హత జగన్ కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు.







