మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీకు ఖచ్చితంగా ఆ లోపం ఉన్నట్లే..

సాధారణంగా మన శరీరానికి ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్,ప్రోటీన్స్ కచ్చితంగా లభ్యమవుతే ఎలాంటి లోపం లేకుండా మనం ఆరోగ్యంగా ఉంటాము.సరైన పోషకాలు మన శరీరానికి అందినప్పుడు మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు.

 These Are The Iodine Deficiency Symptoms Details,  Iodine Deficiency Symptoms,-TeluguStop.com

కానీ శరీరానికి ప్రధానమైన కొన్ని పోషకాలు లభించినప్పుడు కొన్ని లోపాలు ఏర్పడతాయి.అయితే అయోడిన్ ( Iodine ) శరీరానికి ఎంతో ప్రధానమైనది.

శరీరానికి పోషకాలతో పాటు, లవణాలు సరైన మొత్తంలో ఉండటం ఎంతో ముఖ్యం.

అయోడిన్ కండరాలను ( Muscles ) పుష్టిగా మార్చడంతో పాటు బలోపేతం చేయడానికి చాలా అవసరం అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

శరీరంలో అయోడిన్ లోపం ఉంటే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.అయోడిన్ లోపం వల్ల మనకు ఎక్కువగా నిద్ర అలాగే ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

అదేవిధంగా శరీరంలో అయోడిన్ లోపం కారణంగా ఎన్నో రకాల సంకేతాలను ఇస్తుంది.వీటి ఆధారంగా అయోడిన్ లోపం ఉందని గ్రహించి చర్యలు తీసుకోవడం చాలా అవసరం.శరీరంలో అయోడిన్ లోపం ఉంటే మెడలో వాపు కనిపిస్తుంది.

Telugu Brain, Imbalance, Tips, Iodine, Muscles, Salt, Sleep, Thyroid-Telugu Heal

ఎందుకంటే శరీరంలో అయోడిన్ లోపం ఉన్నప్పుడు థైరాయిడ్ ( Thyroid ) శరీరంలో పెరగడం మొదలవుతుంది.దీని వల్ల గొంతు ఉబ్బుతుంది.అదేవిధంగా మెడలో కూడా వాపు వస్తుంది.దానిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలో చిక్కుకున్నట్టే.ఎందుకంటే ఇది అయోడిన్ లోపం యొక్క లక్షణం.శరీరంలో అయోడిన్ లోపం ఉంటే శరీర బరువు కూడా పెరగడం ప్రారంభం అవుతుంది.అయోడిన్ లోపం వల్ల శరీరంలో మెటబాలిజం తగ్గి బరువు పెరగడం మొదలవుతుంది.

Telugu Brain, Imbalance, Tips, Iodine, Muscles, Salt, Sleep, Thyroid-Telugu Heal

అంతేకాకుండా ఆ జీవక్రియ రేటు మందగించడానికి హార్మోన్ల అసమతుల్యత కూడా కారణం.ఇక బరువు ఆకస్మాత్తుగా పెరగడం మొదలైతే అయోడిన్ పరీక్ష చేయించుకుని చర్యలు తీసుకోవడం మంచిది.ఇక అయోడిన్ లోపం వల్ల జ్ఞాపకశక్తి కూడా బలహీనపడుతుంది.మనిషికి ఏది కూడా గుర్తు ఉండదు.ఏమీ గుర్తుకు రావడంలేదని మీరు భావిస్తే దానిపై దృష్టి పెట్టాలి.వైద్య చర్యలు తీసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube