నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు క్లియో స్పోర్ట్స్ అరేనా స్టేడియంలో గత నెల 22వ తేదీన ప్రారంభమైన జిల్లా స్థాయి క్లియో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది.32 జట్లు టోర్నీలో పాల్గొనగా మిర్యాలగూడకి చెందిన కెఎస్ఆర్ యూ జట్టు విజేతగా నిలిచింది.ఈ టోర్నీకి మొదటి బహుమతిని మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి(బీఎల్ఆర్)రూ.లక్ష స్పాన్సర్ చేశారు.కాగా విజేత జట్టయిన కెఎస్ఆర్ యూ కు,రన్నర్ అప్ అడ్డూ లెవన్ జట్టుకు బత్తుల ఈశ్వర్,
న్యాయవాది రవీందర్ రెడ్డితో కలిసి బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తూ సమాజంలో గుర్తింపు పొందాలని కోరారు.
ప్రతిభ కలిగిన క్రీడాకారులకు తమ నుంచి ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.సయ్యద్ సల్మాన్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.
ఈ కార్యక్రమంలో క్లియో ఎండి ఏచూరి హర్ష,నేతి వెంకటేశ్వర్లు,క్రికెట్ కోచ్ కావాలి వెంకన్న, బ్యాడ్మింటన్ కోచ్ మారబోయిన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.







