సముద్రంలో పడిపోయిన యాపిల్ వాచ్ ని కనిపెట్టేసిన వ్యక్తి... ఎలాగంటే?

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్స్ కంటే స్మార్ట్‌వాచ్ ( Smart Watch ) ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది.అయితే ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ అయినా ఒక్కసారి పోయిందంటే అంతే సంగతి, దొరకడం చాలా కష్టం.

 Man Loses Apple Watch In Sea Locates Using Find My App Details, The Man , Latest-TeluguStop.com

అలా ఏవైనా వస్తువులను పొగొట్టుకున్నవారు సాధారణంగా పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చి, రికవరీ కోసం వెయిట్ చేస్తూ వుంటారు.ఇక కొన్ని నెలలు గడిచిన తరువాత ఇక అవి దొరకవు అని నిర్ధారణ చేసుకున్నాక కొత్త గాడ్జెట్ కొనుగోలు చేసుకుంటూ వుంటారు.

అంతేగాని ఇలాంటి వస్తువులు దొరకడం అనేది చాలా అరుదు అని చెప్పుకోవాలి.

అయితే ఇటీవల కాలంలో వస్తున్న స్మార్ట్ గాడ్జెట్స్‌లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉండడం వలన ఆ పరిస్థితి ఇపుడు దాదాపుగా లేదనే చెప్పుకోవాలి.

ఇప్పుడు స్మార్ట్‌ఫోన్, వాచ్, ఇతర డివైజ్‌లు ఏవైనా మిస్ అయితే, వాటిని ఈజీగా ట్రాక్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది.తాజాగా సముద్రంలో కొట్టుకుపోయిన యాపిల్ స్మార్ట్‌వాచ్‌ను( Apple Smart Watch ) ఇలాంటి టెక్నాలజీతో కనిపెట్టారు.

జెఫెర్సన్ రోచా ఓ బ్రెజిలియన్.అతడు బ్రెజిల్ ( Brazil ) రాజధాని రియో డి జనీరోకు సమీపంలోని బుజియోస్‌‌లో ఉన్న సముద్రంలో స్కూనర్ ట్రిప్ చేస్తూ స్మార్ట్‌వాచ్‌ పొగొట్టుకున్నాడు.

Telugu Apple Watch, Brazil, Fell Sea, Find App, Jefferson Rocha, Latest-Latest N

అయితే ఫైండ్ మై యాప్ ఉపయోగించి కొన్ని రోజుల తరువాత దాన్ని తిరిగి పొందాడు.కాగా ఈ విషయం ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇటీవల కాలంలో యాపిల్ స్మార్ట్‌వాచ్‌లలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో బెస్ట్ ఫీచర్స్ రావడం మనం గమనిస్తూ వున్నాం.రోచా పొగొట్టుకున్న వాచ్‌ GPSతో పాటు అడ్వాన్స్‌డ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫీచర్స్ కారణంగా రోచాకు ఫైండ్ మై యాప్ ద్వారా వాచ్ ఆన్ అయిందని నోటిఫికేషన్ వచ్చింది.

Telugu Apple Watch, Brazil, Fell Sea, Find App, Jefferson Rocha, Latest-Latest N

దీంతో తన యాపిల్ స్మార్ట్‌వాచ్ దొరికిన వ్యక్తిని గుర్తించే క్రమంలో యాపిల్ వాచ్‌ను కనుగొన్నట్లు అతడికి 16 ఏళ్ల అమ్మాయి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ వచ్చింది.సదరు యాపిల్ స్మార్ట్‌వాచ్‌ 50 ఏళ్ల డైవర్ ఫిల్హోకు దొరకగా అతగాడు అతని 16 ఏళ్ల అమ్మాయికి ఇచ్చాడు.తరువాత దానిని వారు మన బ్రెజిలియన్ కి ఇచ్చేసారు.

కాగా, రెండు రోజుల పాటు నీటిలో ఉన్నా, యాపిల్ స్మార్ట్ వాచ్ తిరిగి పనిచేయడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube