వైరల్: ఈ చిరుతని చూసి సూర్య నమస్కారం ఎలా చెయ్యాలో నేర్చుకోండి పిల్లలూ!

చిరుతేమిటి.సూర్య నమస్కారం పెట్టడం ఏమిటి అని ఆశ్చర్యంగా వుంది కదూ.నిజమే, సూర్య నమస్కారం(Surya namaskar ) అనేది భారతీయ హిందూ సంస్కృతిలో ఒక భాగం అని అనుకోవాలి.ఒకప్పుడు బ్రాహ్మణులు మాత్రమే నదీ తీరానికి వెళ్లి సూర్య నమస్కారం వంటివి చేసేవారు.

 Viral: Watch This Leopard And Learn How To Do Surya Namaskar Viral Latest, News-TeluguStop.com

కాలక్రమేణా అందరూ దానిని ఆచరించడం మొదలు పెట్టారు.అంతేకాకుండా చాలామంది మంచి ఆరోగ్యం దృష్ట్యా కూడా రకరకాల యోగాసనాలలో దానిని భాగం చేసారు.

ఈ క్రమంలో యోగాలో భాగమైన సూర్య నమస్కారానికి చాలామంది ప్రాధాన్యత ఇస్తున్నారు.కనిపించే దైవంగా సూర్యున్ని భావించి ఈ విధంగా నమస్కారం చేస్తారనే విషయం అందరికీ తెలిసినదే.

అయితే ఇక్కడ మనుషులే సూర్య నమస్కారం చేస్తే మేటర్ ఏముంటుంది చెప్పండి.తాజాగా రష్యా ఫారెస్ట్‌లోని ‘ల్యాండ్‌ ఆఫ్‌ ది లెపార్డ్‌’ నేషనల్‌ పార్క్‌లో ఓ చిరుతపులి( Leopard ) సూర్యనమస్కారం చేస్తూ కనిపించి స్థానికులను అవాక్కయేలా చేసింది.దాంతో దానికి సంబంధించిన దృశ్యాలను ఒకరు తమ కెమెరాలు బంధించగా అది కాస్త వైరల్ అవుతోంది.ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి సుశాంత నంద తరచూ అద్భుతమైన వన్యప్రాణుల వీడియోలతో షేర్‌ చేస్తూ ఉంటాడు.

తాజాగా సోషల్‌ మీడియాలో చిరుతపులికి సంబంధించిన ఒక మనోహరమైన వీడియోను తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోని ఒక్కసారి చూస్తే… చిరుతపులి నిద్రలేచాక వార్మప్‌ చేయడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.ఉదయాన్నే లేచి శరీరాన్ని సాగదీయడం.కాళ్లమీద ముందుకు ఒంగి తల పైకెత్తి ఆ తరువాత వెనక కాళ్లను ముందు సాగదీసి బాడీని లూజ్ చేస్తోంది.

సాధారణంగా చిరుత ఒక్కటే కాదు చాలా జంతువులు ఉదయం లేవగానే ఇలాగే చేస్తాయి.కానీ ఐఎస్‌ఎస్‌ అధికారి నందా పోస్టు చేసిన చిరుత వీడియోకు ‘సూర్య నమస్కారం చేస్తున్న చిరుతపులి’ అంటూ క్యాప్షన్‌ ఇవ్వడం కొసమెరుపు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కొంతమంది ‘ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ చిరుతపులి’ అని కామెంట్ చేస్తుంటే మరికొందరు చిరుతపులి ‘ఫిట్‌నెస్‌ రహస్యం ఏంటి’ అని అడుగుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube