అప్పలరాజు కు పదవీ గండం ?  జగన్ పిలుపు అందుకేనా ?

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ముగియడం తో ఏపీ క్యాబినెట్ ను జగన్( Jagan ) ప్రక్షాళన చేస్తారని గత కొద్ది రోజులుగా హడావుడి జరుగుతుంది.దీనికి తగ్గట్లుగానే వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ గవర్నర్ తో కొద్దిరోజుల క్రితమే భేటీ అయ్యారు.

 Appalaraju's Tenure? Is That Why Jagans Call,ap Minister Sidiri Appalaraju, Jaga-TeluguStop.com

ఇదంతా మంత్రివర్గ ప్రక్షాళన కోసమేనని ప్రచారం జరిగింది.ప్రస్తుత మంత్రులలో కొంతమందిని తప్పించి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలలో కొందరికి,  అలాగే కొంతమంది మాజీ మంత్రులకు ఈ మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తారని వైసిపి వర్గాలు వ్యాఖ్యానించాయి .ప్రస్తుత మంత్రులలో పదవి కోల్పోయే వారి లిస్టులో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని  శ్రీకాకుళం జిల్లా కు చెందిన  మంత్రి సిదిరి అప్పలరాజు( Minister Sidiri Appalaraju ) ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.దీనికి తగ్గట్లుగానే ఈరోజు సీఎంవో నుంచి అప్పలరాజుకు పిలుపు అందింది.

ఆ సమయానికి పలాసలో ఉన్న అప్పలరాజు తన కార్యక్రమాలు అన్నిటిని రద్దు చేసుకుని జగన్ ను కలిసేందుకు తాడేపల్లి కి వెళ్లారు.అయితే ఈ పిలుపు వెనుక కారణాలపై రకరకాల ప్రచారం జరుగుతుంది .మంత్రి పదవి నుంచి తప్పించబోతున్నాను అనే విషయాన్ని జగన్ నేరుగా అప్పలరాజుకు చెప్పేందుకే పిలిపించారని ప్రచారం జరుగుతుండగా,  శాఖాపరమైన చర్చల కోసమే తనను పిలిపించారనే అభిప్రాయంతో అప్పలరాజు ఉన్నారు.అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ

ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టబద్దలు నియోజకవర్గ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓటమి చెందడంతో జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని , అంతే కాకుండా ఇటీవల నిర్వహించిన సర్వేలోను అప్పలరాజు పై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలడం, ఇక భూకబ్జా ఆరోపణలు ఆయనపై రావడం, ఇవన్నీ లెక్కలు వేసుకున్న జగన్ అప్పలరాజును తప్పించేందుకే నిర్ణయం తీసుకున్నారని , అందుకే ఆ విషయాన్ని నేరుగా చెప్పి ఆయనను బుజ్జగించబోతున్నారనే చర్చ ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube