భారత్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.ఆరు నెలల తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
గడిచిన 24 గంటల్లో 3,095 కోవిడ్ కేసులు నమోదు కాగా కరోనా కాటుకు ఐదుగురు మృత్యువాత పడ్డారని వైద్యాధికారులు తెలిపారు.దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 15,208 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించారు.
అయితే కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ తో పాటు ఢిల్లీలో కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి.అదేవిధంగా హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది.
మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తం అయింది.ఫ్లూ లక్షణాలు ఉంటే మాస్క్ వాడాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
అంతేకాకుండా కరోనా తాజా పరిస్థితులపై ఇవాళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.







