పార్లమెంట్లో పసుపు బోర్డు( Turmeric Board ) కోసం ప్రశ్నలు సందించిన కవిత మాలోతు, దయాకర్ పసునూరి ,గడ్డం రంజిత్ ప్రశ్నలకు జవాబు ఇస్తూ కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పాటిల్ ఒక నిర్దిష్టమైన స్పైసెస్ బోర్డ్ ను ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రస్తుతానికి కేంద్రానికి లేదంటూ స్పష్టం చేశారు.అదేవిధంగా రైల్వే కోచ్ ఏర్పాటుపై ప్రశ్నించిన ఎంపీలకు సమాధానంగా రైల్వే శాఖ మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో రైల్వే కోచ్ ఏర్పాటు చేస్తే అవసరం లేదంటూ సమాధానం ఇచ్చారు ఇప్పటికే ఏర్పాటు చేసిన రైల్వే కోచ్ లు శాఖ అవసరాలు తీర్చడం లో సరిపోతాయంటూ చెప్పుకొచ్చారు.ఈ అంశం పై మీడియా సమావేశం లో మాట్లాడిన కేటీఆర్ ( KTR ) కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు

ప్రధాని పదవి అన్నది దేశంలోనే అత్యున్నత స్థానం అని వ్యక్తిగత ప్రయోజనాలు ఎన్ని ఉన్నా కూడా సమున్నత స్థానంలో కూర్చున్న వ్యక్తి అందర్నీ సమానంగా చూడాల్సిన బాధ్యత కూడా ఉందని ఆయన ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇప్పటికీ కూడా గుజరాత్ ముఖ్యమంత్రి స్తాయి లోనే ఆలోచనలు చేస్తున్నారంటూ విమర్శలు కురిపించారు … తెలంగాణకు హక్కుగా రావలసిన కోచ్ ఫ్యాక్టరీ గాని, ఐటిఐ ఆర్ గాని, మెట్రో రెండవ దశ గాని, కాలేశ్వరం ప్రాజెక్ట్ రెండవ దశ గాని ఇలా రాష్ట్ర ప్రగతికి కీలక అంశాలైన ఏ ఒక్క అంశాన్ని కూడా తన ప్రయారిటీ లిస్ట్ లో పెట్టుకొని మోడీ ని( PM Modi ) తెలంగాణ ప్రజలు ఎందుకు ప్రయారిటీ లిస్టులో పెట్టుకోవాలంటూ ఆయన ప్రశ్నించారు.

అధికారం కోసం రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలు మామూలేనని కానీ రాజకీయం యొక్క అంతిమ పరమావధి ప్రజా శ్రేయసే కావాలని.ప్రజలకు ఉపయోగపడని వ్యూహాలు ఎందుకు కోరగానివని ఆయన చెప్పుకొచ్చారు.ప్రధానమంత్రిగా రెండు పర్యాయాలు గద్దెనెక్కినప్పటికీ కూడా ఇప్పటికీ గుజరాత్ ముఖ్యమంత్రి లాగానే ఆయన ఆలోచిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గుజరాతి బాసుల చెప్పులు మోసే నాయకులను ఎన్నుకునే దీన స్థితిలో తెలంగాణ బిజెపి ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.అధికారం తాత్కాలికమని కానీ ఇందుకోసం ప్రజలను మోసం చేస్తే దాని ఫలితం అనుభవించక తప్పదుఅంటూ ఆయన చెప్పుకొచ్చారు .







