నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రాజకీయాలు వేడెక్కాయి.నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.
ఉదయగిరికి వస్తే తరిమికొడతామంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన సవాల్ ను చేజర్ల సుబ్బారెడ్డి, ఆయన వర్గం స్వీకరించింది.ఇందులో భాగంగా ఇవాళ బస్టాండ్ సెంటర్ కు ఆయన తన వర్గీయులతో కలిసి వెళ్లనున్నారు.
అయితే మేకపాటి ఉదయగిరికి వస్తే తరిమికొడతామని ఇటీవల సుబ్బారెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే.ఈ ఛాలెంజ్ పై స్పందించిన మేకపాటి తరిమికొడతామన్నవాళ్లు రావాలని సవాల్ చేశారు.
ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు.







