కేవలం 20 రూపాయలకే అదిరిపోయే స్పైసీ చికెన్ రోల్ ఆరగించేయండి!

స్పైసీ చికెన్ రోల్( Spicy Chicken Roll ) అనగానే నోట్లో లాలాజలం వూరుతోంది కదూ.ముఖ్యంగా యువతకి చికెన్( Chicken ) సంబంధిత వంటకాలు అంటే మక్కువ ఎక్కువ.

 Enjoy A Delicious Spicy Chicken Roll For Just 20 Rupees ,chicken Roll , Spicy C-TeluguStop.com

ఇక మన హైదరాబాద్‌ అయితే చికెన్ బిర్యానీకి( chicken biryani ) పెట్టింది పేరు.అయితే ఇక్కడ కూడా చికెన్ రోల్స్‌ వంటివి తినాలంటే కనీసం కనీసం రూ.100 చెల్లించాల్సిన పరిస్థితి.అలాంటిది 20 రూపాయలకే అదిరిపోయే చికెన్ రోల్స్ ఇస్తున్నారంటే మీరు నమ్ముతారా? కానీ ఇది అక్షరాలా నిజం.

ఝార్ఖండ్‌( Jharkhand )లో ఓ చిరువ్యాపారి కేవలం 20 రూపాయలకే పసందైన చికెన్ రోల్స్ అమ్ముతున్నాడు.తక్కువ ధరకే రావడం, రుచి కూడా బావుండడంతో ఇతడి బండి వద్ద ప్రతిరోజూ జనం క్యూ కడుతూ వుంటారు.జంషెడ్‌పూర్‌లోని మహమ్మదీయ లైన్, సక్చి స్ట్రెయిట్ మైల్ రోడ్‌లో ఓ చిన్న చికెన్ రోల్ బండి కనిపిస్తుంది.ఇక్కడ తక్కువ ధరకే చికెన్ రోల్ లభిస్తుంది.మీరు అటువైపుగా ఎపుడైనా వెళ్ళినపుడు ఒకసారి ట్రై చేయండి.ఇక్కడ రోజూ 500 నుంచి 300 చికెన్ రోల్స్ విక్రయిస్తున్నట్లు షాపు యజమాని నవేద్ తెలిపారు.

నవేద్ 2017 నుంచి ఇక్కడ చికెన్ రోల్స్ అమ్ముతున్నట్టు తెలుస్తోంది.చికెన్ రోల్‌లో చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసుకొని తింటే.టేస్ట్ అద్భుతంగా ఉంటుందటని ఆయనదగ్గరకి వెళుతున్న కస్టమర్లు చెబుతున్నారు.మొదట్లో తక్కువ మంది మాత్రమే వచ్చారని.కానీ దీని రుచి మరిగి ప్రతి రోజూ వందల మంది తమ షాప్‌కు వస్తున్నారని ఆయన చెప్పారు.తన షాపులో రోజూ 30 కిలోల చికెన్ వరకు వినియోగిస్తున్నారు.2017 నుంచి అదే రేటుకు చికెన్ రోల్స్ విక్రయిస్తున్నారు.నవేద్ దుకాణానికి వచ్చే వారిలో విద్యార్థులే ఎక్కువ మంది ఉండడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube