చరణ్( Charan ) బర్త్ డే రోజు అల్లు అర్జున్ ట్వీట్ చేసి విష్ చేయలేదు అని మెగా ఫ్యాన్స్ అంతా మరోసారి అల్లు అర్జున్ ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఆ నెక్స్ట్ డేనే అల్లు అర్జున్ ( Allu Arjun )తను 20 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసిన సందర్భంగా చిరంజీవి విష్ చేశారు.
బాస్ చెప్పాడు కానీ నువ్వు చరణ్ కి విషెస్ చెప్పలేదు అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు.కానీ అసలు విషయం ఏంటంటే ట్విట్టర్ లో చెప్పలేదు కానీ చరణ్, అల్లు అర్జున్ ఆరోజు వీడియో కాల్ లో మాట్లాడుకున్నారట.

కేవలం ట్వీట్ చేస్తేనే ఆ హీరో మీద ప్రేమ ఉన్నట్టు కాదు.అంతేకాదు ఆ హీరోలిద్దరు బాగానే ఉన్నారు.ఉంటారు కూడా కానీ ఈ ఫ్యాన్స్ మాత్రం ఇలా ఒకరిని ఒకరు టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంటారు.అఫ్కోర్స్ ఇది ఒకప్పటిక్ ఆగేది కాదు కానీ ట్వీట్ వేస్తేనే హీరోల మధ్య సఖ్యత ఉన్నట్టు అనుకుంటే పొరబడినట్టే.
బయటకు కనిపించరేమో కానీ అందరు హీరోలు సరదాగానే ఉంటారు.కానీ ఫ్యాన్స్ మాత్రం వారి మధ్య పచ్చగడ్డి వేసినా బగ్గు మనేలా ఉంటారు.ఈ పద్ధతి రోజు రోజుకి మరింత పెరుగుతూ వస్తుంది.సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్ వార్ మరింత పెరిగిందని చెప్పొచ్చు.







