అందరూ ఎక్కువగా ఇష్టపడే క్రీడలలో క్రికెట్ ( Cricket ) ఒకటి.క్రికెట్‌ని చాలా మంది జెంటిల్ మాన్ గేమ్ అని కూడా అంటుంటారు.
ఎందుకంటే ఆటకి సంబంధించిన కొన్ని రూల్స్ పాటిస్తూ క్రికెట్ ఆడాలి.క్రికెట్ అనేది రెండు టీమ్స్ కలిసి ఆడతారు.
అయితే ఈ రూల్స్ అనేవి స్టేడియంలో ఆడేవాళ్ళకే.బయట ఇంటి దగ్గర ఉండే గ్రౌండ్ లో, సంధు గొందులలో ఆడేవాళ్ళు వాళ్లకి రూల్స్ ఉండవు.
ఒక్కోసారి గల్లీ క్రికెట్( Gully Cricket ) రూల్స్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ట్విట్టర్‌లో చక్కర్లు కొడుతుంది.ఈ వీడియోలో బాటింగ్ చేసే అతని టెక్నిక్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.సాధారణంగా బౌలర్ బాల్ వేసిన తరువాత బ్యాట్స్ మ్యాన్( Batsman ) బంతిని కొట్టి పరుగులు తీయడానికి ప్రయత్నస్తుంటారు.
అయితే ఈ ప్రాసెస్ అనేది అంతర్జాతీయ స్టేడియంలో అయిన గల్లీలో అయిన ఒకేలా ఉంటుంది.కానీ ఈ వీడియోలో మాత్రం బ్యాట్స్ మ్యాన్ వెరైటీగా ఆలోచించాడు.

అందరిలా పడుగులు తీస్తే కిక్ ఏముంది అనుకున్నాడో ఏమో వింతగా బ్యాటింగ్ చేసి పరుగులు తీసాడు.బౌలర్ బాల్ ని వేయకముందే పురుగులు తీయడం మొదలు పెట్టాడు.అంతలోనే బౌలర్ బంతి విసురుతాడు.పరుగు తీస్తున్న ఈ బ్యాట్స్ మ్యాన్ రన్స్ మధ్యలోనే బాల్ కొడుతూ పరుగుని పూర్తి చేస్తాడు.బ్యాట్స్ మ్యాన్ అలా వెరైటీగా పరుగులు తీయడం చూసి అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా నోరేళ్లబెట్టారు.ఈ వింత బ్యాట్స్ మ్యాన్ పరుగుల వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
ఈ వీడియోని చూసిన చాలామంది ప్రపంచ క్రికెటర్స్ కి ఇలా ఆడాలని తెలియక మరోలా ఆడుతున్నారని కామెంట్స్ పెడుతున్నారు.







