నాని, కీర్తి సురేష్ ( Nani, Keerthy Suresh )కాంబినేషన్ లో తెరకెక్కిన దసరా మూవీ( dasara ) నేడు థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగంగా మాట్లాడుతూ దసరా సినిమాకు కీర్తి సురేష్ నో చెప్పడంతో సంతోషించానని అన్నారు.దసరా కథను మొదట నానికి వినిపించానని ఈ సినిమాలో కీర్తి హీరోయిన్ గా బాగుంటుందని నాని చెప్పారని శ్రీకాంత్ అన్నారు.
ఇద్దరు స్టార్స్ ను డీల్ చేయడం సులువు కాదని భావించి కీర్తి సురేష్ వద్దని చెప్పానని శ్రీకాంత్ ఓదెల కామెంట్లు చేశారు.ఈ సినిమాలో తెలుగమ్మాయి అయితే బాగుంటుందని నేను అనుకున్నానని ఆయన తెలిపారు.
తెలుగమ్మాయి దొరకకపోవడంతో కీర్తి సురేష్ కు కథ వినిపించానని శ్రీకాంత్ ఓదెల కామెంట్లు చేశారు.తొలిసారి దసరా కథ విన్న సమయంలో కీర్తి సురేష్ రిజెక్ట్ చేశారని ఆయన అన్నారు.

కథ చెప్పిన సమయంలో కీర్తి ఎక్కడ అంగీకరిస్తుందో అని భయపడ్డానని శ్రీకాంత్ ఓదెల అన్నారు.నానికి అదే విషయం చెప్పగా కథ అర్థం కాకపోవడం వల్లే నో చెప్పినట్టు కీర్తి చెప్పిందని శ్రీకాంత్ ఓదెల పేర్కొన్నారు.ఆ తర్వాత ట్రాన్స్ లేటర్ సహాయంతో కీర్తి సురేష్ కథ విన్నారని అప్పుడు ఆమె అంగీకరించారని శ్రీకాంత్ ఓదెల అన్నారు.ఫస్ట్ డే షూట్ లో పేడ కలపమని చెప్పగా ఆమె ఆ షాట్ చేయడంతో నాకు ఉత్సాహం వచ్చిందని ఆయన తెలిపారు.

ఏ షాట్ అయినా కీర్తి సురేష్ తో చేయించుకోవచ్చని నాకు అర్థమైందని శ్రీకాంత్ ఓదెల చెప్పుకొచ్చారు.దసరా మూవీ పూర్తైన తర్వాత వెన్నెల పాత్రలో కీర్తిని తప్ప మరొకరిని ఊహించుకోలేకపోయానని ఆయన వెల్లడించారు.శ్రీకాంత్ ఓదెల చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.







