నాని( Nani ), కీర్తి సురేష్( Keerthy Suresh ) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దసరా మూవీ థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే దసరా ప్రీమియర్ షో( Dasara Premiere Show లు పూర్తయ్యాయి.
శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం గమనార్హం.ఈ సినిమా ట్విట్టర్ రివ్యూలు సైతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

ఫస్టాఫ్ అద్భుతంగా ఉండగా సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లోగా ఉన్నాయి.ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.స్టార్ డైరెక్టర్ల స్థాయిలో శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) ఈ సినిమాను తెరకెక్కించగా నిర్మాతలు ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు.ధరణి పాత్రకు నాని పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.
నాని, కీర్తి సురేష్ జోడీగా మరోసారి హిట్ కాంబినేషన్( Hit Combination ) అని అనిపించుకోవడం గమనార్హం.

నాని ధరణి( Dharani ) పాత్రలో అన్ని భావాలను అద్భుతంగా పలికించారు.తన ఎక్స్ ప్రెషన్స్ తో నాని ఎంతగానో ఆకట్టుకున్నారు.కీర్తి సురేష్ నటన, యాక్షన్ సీన్స్( Action Scenes ) ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.
ఇంటర్వెల్ సీన్ మాత్రం ఆడియన్స్ ను ఒకింత షాక్ కు గురి చేస్తుంది.సినిమాలో సముద్రఖని( Samuthirakani )పాత్ర మాత్రం ఆకట్టుకోలేదు.కొన్ని బోరింగ్ సీన్లు, ఊహలకు అనుగుణంగా సాగే కథనం, స్లో నారేషన్ సినిమాకు మైనస్ అయ్యాయి.
నాని నటన, మ్యూజిక్, బీజీఎం, ఎమోషనల్ సన్నివేశాలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
నాని, కీర్తి సురేష్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు.దసరా సినిమా( Dasara )కు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి.







