సోషల్ మీడియా( Social Media ) వచ్చాక మనం జంతువుల గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటున్నాం.వైరల్ అవుతున్న వీడియోలలో కూడా ఎక్కువగా వైల్డ్ యానిమల్స్ వీడియోలు ఉండడం గమనార్హం.
ఇక తాజాగా వైరల్ అవుతున్న వీడియోని చూసిన నెటిజన్లు అందులో జింక( Deer )ను చూసి, ఇది కృతజ్ఞతలు చూపించడంలో మనిషినే మించిపోయేలా వుందే అని కామెంట్లు పెడుతున్నారు.అవును, ఓ జింక తన ప్రాణాలను కాపాడిన వ్యక్తి పట్ల మనుషుల కంటే ఎక్కువ విశ్వాసం చూపించి ఔరా అనిపించింది.

వీడియో వివరాల్లోకి వెళితే… వైరల్ అవుతున్న వీడియోలో ఓ జింక ఫెన్షింగ్ దాటేందుకు యత్నించి.వైర్ మీద పడిపోయి అవతలకి వెళ్లలేకపోయింది, అలాగని ఇవతలకు కూడా రాలేకపోయింది.అలాగే దానిమీద వేలాడుతూ గిలగిలా కొట్టుకొని అలాగే కాసేపటికి అలసిపోయి ఉండిపోయింది.దాంతో ప్రాణాపాయ స్థితిలో పడిపోయింది.ఇంతలో దానిని గమనించిన ఓ వ్యక్తి.ప్రమాదంలో ఉన్న జింకను కాపాడి, ఫెన్సింగ్ అవతలివైపుకి నెట్టాడు.
దాంతో హమ్మయ్య అనుకొని జింక అక్కడి నుంచి సంతోషంగా చెంగు చెంగుమంటూ బయటకు వెళ్లిపోయింది.

కట్ చేస్తే… అలా వెళ్లిన జింక ఊరికే వుండలేకపోయిందేమో గానీ, తన పరివారాన్నంతా వెంటబెట్టుకొని తనకు సాయం చేసిన వ్యక్తికి థాంక్స్ చెప్పడానికి ఏకంగా అతని ఇంటి దగ్గరకే వెళ్లాయి.అతను తన ఇంటి డోర్ ఓపెన్ చేయగానే పదుల సంఖ్యలో అక్కడ జింకలు( Deers herd ) ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు.కాసేపటికి సాయం చేసినందుకు కృతజ్ఞతగా ఇవన్నీ వచ్చాయని రియలైజ్ అయ్యాడు.
దాంతో ఉండలేక వాటి వీడియోని తన మొబైల్ లో తీసుకున్నాడు.కాగా సదరు వీడియోని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంతనంద తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేయగా ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
నెటిజన్లు ఆ వీడియో చూసి ఫిదా అయిపోతున్నారు.







