నేడు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్( Nampally Exhibition Grounds ) లో 41వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభ అంగరంగ వైభవంగా జరిగింది.రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు.
ఈ సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు( TDP MP Rammohan Naidu ) ఇచ్చిన స్పీచ్ చాలా హైలెట్ అయింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ పాదయాత్ర 50 రోజులకే పరిస్థితులు పూర్తిగా మారాయని అన్నారు.
ఇక పాదయాత్ర పూర్తిగా కంప్లీట్ అయితే ఏపీ రాజకీయ ముఖచిత్రం మారి వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.జగన్ పైన సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని అన్నారు.
అందువల్లే పట్టబద్రుల ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలిచిందని వివరించారు.ఇదే సమయంలో సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై సెటైర్లు వేశారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇంకా రైల్వే జోన్ గురించి కాదు.బాబాయ్ హత్య కేసు కాలభేరం కోసం ఢిల్లీ వెళ్తున్నారు.అక్కడ తెలుగుజాతి పరువును తాకట్టు పెడుతున్నారు.కానీ తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు గర్వపడేలా చేసింది.1983లో ప్రపంచకప్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు మాదిరిగా టీడీపీ దూసుకుపోయింది.హైదరాబాద్ లో మాదిరిగా అమరావతిలో కూడా పునాదులు చంద్రబాబుతోనే సాధ్యమని ఎంపీ రామ్మోహన్ నాయుడు వివరించారు.2024లో టీడీపీ గెలుపును ఎవరు ఆపలేరని రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.