పెద్దైన తర్వాత తండ్రిలానే ఉంటా.. వైరల్ అవుతున్న తారకరత్న కొడుకు ఫోటో!

నందమూరి తారకరత్న( Nandamuri Tarakaratna ) మరణం ఫ్యాన్స్ ను, నందమూరి కుటుంబ సభ్యులను ఎంతగానో బాధ పెట్టింది.తారకరత్న చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలతో మృతి చెందడంతో తారకరత్న అభిమానులు సైతం ఎంతగానో ఫీల్ అయ్యారు.

 Tarakaratna Son Photo Goes Viral In Social Media Details Here Goes Viral , Tara-TeluguStop.com

తారకరత్నకు ముగ్గురు పిల్లలు కాగా నిష్క పెట్టిన పోస్ట్ లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.చిన్న వయస్సులోనే నిష్క మెచ్యూరిటీని చూసి షాకవుతున్నామని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే తారకరత్న కొడుకు ఫోటో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.పెద్దయ్యాక తాను కూడా తండ్రిలా ఉంటాననే అర్థం వచ్చేలా ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి( Alekhya Reddy ) తన కొడుకు పెద్దయ్యాక తండ్రిలా కావాలని కోరుకుంటున్నానని ఈ ఫోటోతో చెప్పకనే చెప్పేశారు.తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో అలేఖ్యా రెడ్డి ఈ ఫోటోను షేర్ చేయడం గమనార్హం.

మరోవైపు అలేఖ్యారెడ్డికి తారకరత్న ఆస్తులు దక్కుతాయా లేదా అనే చర్చ జరుగుతోంది.వారసత్వంగా తారకరత్నకు కోట్ల రూపాయల ఆస్తులు రావాల్సి ఉండగా ఆ ఆస్తులు ఉంటే తారకరత్న కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పవచ్చు.తారకరత్న నట వారసత్వాన్ని ఆయన పిల్లలు కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తారకరత్న నటించిన కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉండగా ఆ సినిమాలు థియేటర్లలో ఎప్పుడు రిలీజవుతాయో చూడాల్సి ఉంది.తారకరత్న నటుడిగా మంచి సినిమాలే చేసినా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదని తెలిసిందే.తారకరత్నకు ఇద్దరు కొడుకులు కాగా వాళ్లిద్దరూ చిన్న పిల్లలనే సంగతి తెలిసిందే.

ప్రతి నెలా బాలయ్య లక్షల రూపాయలు అలేఖ్యా రెడ్డి కుటుంబానికి ఇస్తూ తన వంతు సహాయం చేస్తున్నారని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube