దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఈడీ అధికారులు విచారించారు.
లిక్కర్ పాలసీ ఆమోదం పొందక ముందే గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ లలో డ్రాఫ్ట్ పాలసీని ఈడీ గుర్తించింది.కాగా సౌత్ గ్రూప్ కోసం ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఢిల్లీలో పని చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు ఇదే కేసులో రానున్న రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ఈడీ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం.