మరికాసేపటిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.మే 24తో అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న సంగతి తెలిసిందే.

 Karnataka Assembly Election Schedule Soon-TeluguStop.com

ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.అయితే కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు కావాల్సి ఉంటుంది.ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కు 75 మ మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

మరోవైపు అధికారం దక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ లు పోటాపోటీగా ప్రణాళికలు రచిస్తున్నాయి.ఇందులో భాగంగా 124 స్థానాలకు గానూ కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది.

అటు జేడీఎస్ సైతం 93 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.అయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తో పాటు వాయనాడ్, జలంధర్ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube