మరికాసేపటిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.మే 24తో అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న సంగతి తెలిసిందే.

ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

అయితే కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు కావాల్సి ఉంటుంది.

ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కు 75 మ మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

మరోవైపు అధికారం దక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ లు పోటాపోటీగా ప్రణాళికలు రచిస్తున్నాయి.ఇందులో భాగంగా 124 స్థానాలకు గానూ కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది.

అటు జేడీఎస్ సైతం 93 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.అయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తో పాటు వాయనాడ్, జలంధర్ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది.

తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేక బాలిక బిక్షాటన.. వీడియో చూస్తే కన్నీరాగదు..