మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూత్ ఆడియన్స్ లో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు.చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా యూత్ ఆడియన్స్ లో ఎక్కువ గుర్తింపు సొంతం చేసుకున్న విశ్వక్సేన్ ఇటీవల దాస్ కా దమ్కీ( Das ka damki ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఆ సినిమాను స్వయంగా తానే నిర్మించి తెరకెక్కించాడు సినిమా కోసం తన ఆస్తులను అమ్మినట్లుగా పలు ఇంటర్వ్యూలో పేర్కొన్న విశ్వక్సేన్ ( vishwak sen )ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగాడా లేదా అనేది కొందరిలో అనుమానం ఉంది.దాస్ కా దమ్కీ సినిమా యూత్ ఆడియన్స్ ని మెప్పించింది.
అయితే కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదనే చెప్పాలి.విశ్వక్సేన్ పెట్టిన పెట్టుబడి దాదాపు మొత్తం కూడా థియేట్రికల్ రైట్స్ మరియు ఇతర రైట్స్ ద్వారా ఇప్పటికే వచ్చి ఉంటాయి అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.
కనుక విశ్వక్సేన్ ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఈ సినిమా తో సేఫ్ అయ్యాడు అనే ప్రచారం జరుగుతుంది.

సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంది కనుక ఆర్థికంగా విశ్వక్ సేన్ సేఫ్ అయ్యాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.కానీ ఇలాంటి ప్రయోగాలను విశ్వక్సేన్ మళ్లీ మళ్లీ చేయాల్సిన అవసరం లేదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరీ ఇంతగా సినిమా కు ఖర్చు చేసి సొంతంగా నిర్మిస్తే కెరియర్ పైనే ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

కనుక జాగ్రత్తగా కెరియర్ ని ప్లాన్ చేసుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు.విశ్వక్సేన్ పుట్టిన రోజు నేడు.ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విశ్వక్సేన్ నటించబోతున్న సినిమా కు సంబంధించిన ప్రకటన వచ్చింది.ఈ సినిమా నిర్మాణంలో త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య( Sai Soujanya ) కూడా భాగస్వామ్యులు కనుక ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.







