Samantha : సమంత ఏమైనా దిల్ రాజు కూతురా.. అందుకే అన్ని రూ.కోట్లు ఖర్చైందా?

శాకుంతలం సినిమా( shakuntalam movie ) కోసం ఏకంగా 80 కోట్ల రూపాయలు ఖర్చైన సంగతి తెలిసిందే.సమంతను నమ్మి ఈ స్థాయిలో గుణశేఖర్( Gunasekar ), దిల్ రాజు( Dil Raju ) ఖర్చు చేశారు.

 Gunasekhar Shocking Comments About Shakuntalam Movie Budget Details Here Goes V-TeluguStop.com

ఈ సినిమా త్రీడీలో కూడా థియేటర్లలో విడుదలవుతూ ఉండగా త్రీడీలో ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.ఏప్రిల్ నెలలో విడుదలవుతున్న సినిమాలలో హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇదేనని సమాచారం అందుతోంది.

తాజాగా ఈ సినిమా గురించి గుణశేఖర్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.దిల్ రాజు ఈ సినిమా కోసం పెడుతున్న బడ్జెట్ చూసి సమంత( Samantha ) ఏమైనా దిల్ రాజు కూతురా అని నన్ను అడిగారని ఆయన పేర్కొన్నారు.

ఇంతా ఖర్చు పెట్టేశారు ఏంటని అడిగారని గుణశేఖర్ చెప్పుకొచ్చారు.లేడీ ఓరియెంటెడ్ సినిమాపై ఈ స్థాయిలో ఖర్చు చేయడం సమంత మూవీ విషయంలోనే జరిగిందని దిల్ రాజు, గుణశేఖర్ చెబుతున్నారు.

దిల్ రాజు ఈ సినిమా గురించి మాట్లాడుతూ శాకుంతలం సినిమాను త్రీడీలో తీయాలని అనుకున్నది నేనేనని ఈ సినిమాకు బడ్జెట్ పెరుగుతుందని తెలుసని కొన్ని షాట్స్ ను త్రీడీలో చూసిన తర్వాత త్రీడీలో తీయాలని అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు.ఈ రీజన్ వల్లే ఖర్చు విషయంలో వెనుకడుగు వేయలేదని ఆయన కామెంట్లు చేశారు.ఈ సినిమాలో విజువల్ ఇంపాక్ట్స్ ఉన్నాయని అవి త్రీడీలో చూస్తే బాగుంటుందని గుణశేఖర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

వేసవిలో కుటుంబ ప్రేక్షకులంతా ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి థియేటర్లకు వస్తారని దిల్ రాజు కామెంట్లు చేశారు.ఈ సినిమాను చూడటానికి వచ్చే వాళ్లలో పిల్లలు కూడా ఉంటారని వాళ్లను ఆకర్షించడానికి ఈ ప్రయత్నం అని ఆయన కామెంట్లు చేశారు.దిల్ రాజు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube