నాచురల్ స్టార్ నాని( Nani ) సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అతి కొద్దీ మంది మంచి ఆర్టిస్టుల్లో నాని ఒకడు…ఆయన యాక్టింగ్ చేస్తుంటే మనకు నిజంగా ఆయన యాక్టింగ్ చేసినట్టు అనిపించదు పక్కనున్న వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నట్టు గానే ఉంటుంది అలాంటి నాని ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో బాపు ( Bapu )గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన విషయం మనకు తెలిసిందే…ఆ తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ( Indraganti Mohankrishna ) డైరెక్షన్ లో వచ్చిన అష్ట చమ్మ సినిమా( Ashta Chamma movie )తో హీరో గా మారి మంచి సక్సెస్ అందుకున్నాడు ఆయన చేసిన మొదటి సినిమా సక్సెస్ కావడం తో నాని వరుసగా సినిమాల్లో హీరోగా చేస్తూ రోజు రోజుకి ఒక మంచి హీరోగా ఎదుగుతున్నాడు అనే చెప్పాలి…ప్రస్తుతం దసరా సినిమా( Dasara )తో మరో మంచి హిట్ కొట్టడానికి మన ముందుకు వస్తున్నారు…
ఇందులో భాగంగానే నాని, కీర్తి సురేష్ ఇద్దరు కూడా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.అందులో ఆ సినిమా డైరెక్టర్ గురించి ఫన్నీ గా మాట్లాడుతూ ఆయన వాళ్ళని ఎలా టార్చర్ పెట్టాడో చెప్పారు.మొదట హీరోయిన్ గా కీర్తి సురేష్ గారిని కాకుండా వేరే వాళ్ళని తీసుకుందాం అనుకున్నారట కానీ నాని ఉండి కీర్తి అయితేనే మన స్టోరీకి బాగా సెట్ అవుతుందని చెప్పారట, అయిన కూడా డైరెక్టర్ శ్రీకాంత్ మొదట్లో వద్దు అన్నాడట ఆ తరువాత మళ్లీ
ఆమెని కలిసి ఆమెకి స్టోరీ చెప్పాక ఆమెని కొంచం లావు అవ్వమని చెప్పారట… దాంతో ఆమె కొంచం లావు గా మారారు.ఇక ఈ సినిమా స్టార్ట్ అయిన తరువాత అసలు డైరెక్టర్ కి ఈ క్యారెక్టర్ కీర్తి తప్ప వేరే వాళ్ళు చేయలేరు అని నాని తో చెప్పాడట… అలాగే నాని ని కూడా మొదట్లో బాగా లావు అవ్వమని చెప్పి ఆ తరువాత మళ్లీ సన్నగా అవ్వమన్నారట అలా వాళ్ళని డైరెక్టర్ టార్చర్ పెట్టాడు అని ఫన్నీ గా కీర్తి, నాని ఇద్దరు కూడా చెప్తూ నవ్వుకున్నారు…