ఆ విషయం లో చరణ్ అన్నయ్యని మించి పోయాడు...

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది ఇక్కడ సక్సెస్ కావడం అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు, అందుకే సినిమా ఇండస్ట్రీ కి రావడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు.

అలాంటి ఇండస్ట్రీ లో కొందరు ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఇండస్ట్రీ లో మంచి హీరో లు గా గుర్తింపు పొంది, స్టార్ హీరోలుగా మరీనా వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్లలో శ్రీకాంత్( Srikanth ) ఒకరు.

ఈయన చిరంజీవి( Chiranjeevi ) ని చూసి సినిమా ఇండస్ట్రీ కి రావాలి అనుకోని వచ్చి మొదట్లో ఇక్కడ విలన్ వేషాలు వేసుకుంటూ ఆ తరువాత కొన్ని లవ్ స్టోరీస్ లో హీరోగా చేసి శ్రీకాంత్ అంటే మంచి ఫ్యామిలీ సినిమాలు తీస్తాడు అనే ఒక పేరు సంపాదించుకున్నాడు.అలాంటి శ్రీకాంత్ కి చిరంజీవి అంటే చాలా అభిమానం అందుకే చిరంజీవి అడగగానే శంకర్ దాదా ఎం బి బి ఎస్( Shankar Dada MBBS ) సినిమాలో ఏ టి యం పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

పర్సనల్ గా శ్రీకాంత్ గారికి చిరంజీవి అంటే ఇష్టం ఉండటం తో ఆయన మెగా ఫ్యామిలీతో ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు.ఇక చిరంజీవి తనయుడు రామ్ చరణ్( Ram Charan ) తో సినిమాలలో నటించిన ఆయన రామ్ చరణ్ గురించి గురించి ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని చెప్పారు అవేంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం.

రామ్ చరణ్ చిరంజీవి గారి అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తండ్రికి తగ్గ తనయుడిగా ఎపుడో నిరూపించుకున్నాడు.తానో మంచి కమర్షియల్ హీరోనే కాదు తనలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు అని నిరూపించుకున్నాడు.రంగస్థలం సినిమాతో అతను ఎంత మంచి నటుడు అనేది జనం కూడా చూసారు.

Advertisement

అందుకే రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ ఆర్టిస్ట్ ల్లో ఒకరు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆర్ ఆర్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ స్టామినా ఏంటి అనేది మన దేశం తో పాటు ప్రపంచం కూడా చూసింది అని చెప్పుకొచ్చాడు.

ఇంకా రామ్ చరణ్ గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ తనతో గోవిందుడు అందరివాడేలే సినిమాలో నటించినపుడు వ్యక్తిగతంగా తెలుసు, కానీ ఆర్టిస్ట్ గా షూటింగ్ లో ఎలా ఉంటాడా అనుకునేవాడిని, తన తండ్రి లాగే తాను తన చుట్టు ఉన్న వారిని ప్రేమగా చూసుకుంటాడు, అందరికీ భోజనం తానే తెప్పించడం మాట్లాడుతూ కబుర్లు చెప్పడం ఇవన్నీ అన్నయ్య దగ్గరి నుండే వచ్చాయి అంటూ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు