ఓ నిరుద్యోగ యువతి వర్క్ ఫ్రమ్ హోం( Work from home ) పేరిట సైబర్ నేరగాళ్ల వలలో పడి ఐదు లక్షల మూల్యం చెల్లించుకుంది.సైబర్ నేరగాళ్లు ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ, సులువుగా బురిడీ కొట్టించి లక్షలు కొట్టేస్తున్నారు.
అబిడ్స్ లో ఉండే యువతి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంది.తాజాగా ఆమె మొబైల్ ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది.
ఇందులో ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులకు ప్రచారం చేస్తూ రోజుకు దాదాపు 700కు పైగా సంపాదించవచ్చు అని ఆశ చూపించారు.
ముందుగా రిజిస్ట్రేషన్ ఖర్చులకోసం రూ.2,000 ఫీజు కట్టించుకుని, ఒక నెలలో 28 వేల రూపాయల ఆదాయం చూపించారు.ఆ డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే అదనంగా రూ.50 వేలు డిపాజిట్ చేయాలని నిబంధన ఉందని తెలిపారు.ప్రతినెల సంపాదన పెంచుతూ, డిపాజిట్ అమౌంట్ పెంచుతూ వచ్చారు.ఇక చివరగా రూ.500000 డిపాజిట్ చేయించుకొని ఖాతా క్లోజ్ చేశారు.చివరికి తాను మోసపోయిన విషయం గ్రహించిన యువతి సైబర్ క్రైమ్( Cybercrime ) పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సైబర్ క్రైమ్ అధికారులకు వచ్చిన ఫిర్యాదుల ప్రకారం ఎక్కువగా నిరుద్యోగ యువతులను, ఇంట్లో ఉండే గృహిణులను టార్గెట్ చేస్తూ కేవలం 30 నిమిషాలలో 200 నుంచి 300 వరకు సంపాదించుకునే అవకాశం ఉందంటూ పలు రకాల మెసేజ్ లు, లింకులు పంపించి సులువుగా మోసాలకు పాల్పడుతున్నారు.సైబర్ క్రైమ్ కు వస్తున్న ఫిర్యాదులలో ఎక్కువగా పెట్టుబడులకు సంబంధించిన, లకు సంబంధించిన మోసాలే ఉన్నాయి.ఇంట్లోనే ఉంటూ సంపాదించే అవకాశం ఉంది అనగానే తేలికగా నమ్మి అన్ని వర్గాల వారు నమ్మి మోసపోతున్నారు.
సోషల్ మీడియాలో, ఫోన్లో వచ్చే ఇలాంటి ప్రకటనలు నమ్మి మోసపోవద్దని, ఇటువంటివి కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ అధికారులు సూచించారు.