జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ( Anasuya ) ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకొని సినిమా షూటింగ్ పనులతో బిజీగా మారిపోయారు.
ప్రస్తుతం ఈమె వరస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు తాజాగా అనసూయ నటించిన రంగమార్తాండ( Rangamaarthanda ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాలో అనసూయ పాత్రకు కూడా ఎంతో మంచి పేరు వచ్చిందని చెప్పాలి.
ఇలా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నటువంటి అనసూయ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అనసూయ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.సాధారణంగా అనసూయ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.అయితే కొన్నిసార్లు సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే పోస్టుల కారణంగా పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకుంటారు.
ఇలా ఎన్నోసార్లు నెటిజన్స్ ట్రోలింగ్ కి గురైన అనసూయ తాజాగా తాను మొదటగా ఎదుర్కొన్న ట్రోలింగ్స్ గురించి పలు విషయాలను తెలిపారు.
తాను మొదటగా తన భాష గురించే ట్రోల్స్ ఎదుర్కొన్నానని ఈమె తెలియజేశారు.సోషల్ మీడియా( Social media ) వేదికగా ఏదైనా పోస్ట్ చేసినప్పుడు నెటిజెన్స్ కు రిప్లై ఇచ్చే సమయంలో తాను ఇంగ్లీషులో మాట్లాడుతున్నానని పలువురు తనను ట్రోల్ చేశారంటూ ఈ సందర్భంగా తెలిపారు.ముందు నువ్వు తెలుగు మాట్లాడటం నేర్చుకో అంటూ తనకు సలహాలు కూడా ఇచ్చారని తెలియజేశారు.
అయితే నేను పెరిగిన వాతావరణం చదువుకున్న చదువులని బట్టి తాను ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నానని అయితే తాను కూడా తెలంగాణ బిడ్డ నేనని ఇంట్లో ఉన్నప్పుడు తెలంగాణ యాసలోని మాట్లాడుతూ ఉంటానని ఈ సందర్భంగా అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.