సాయి పల్లవి ( Sai Pallavi ).ఇది ఒక పేరు కాదు.
బ్రాండ్ అనే చెప్పాలి.సౌత్ ఇండస్ట్రీ లోనే భారీ క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దు గుమ్మ.
న్యాచురల్ బ్యూటీ( Natural beauty ) అనే గుర్తింపుతో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంది.మన తెలుగులో అయితే భారీ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుని ఏకంగా లేడీ పవర్ స్టార్ అని పిలిపించుకుంది.
ఈమె తెలుగులోకి ఫిదా ( Fida )సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
చేసిన మొదటి సినిమా తోనే అందరిని తన అందం, అభినయంతో ఫిదా చేసింది అనే చెప్పాలి.
ఈ సినిమాతో ఈమె అందరిని తన వైపుకు తిప్పుకుని తన నాచురల్ అందంతో తెలుగు అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనేలా ఆకట్టుకుంది.ఈమె ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలు చేసింది.
అయితే సాయి పల్లవి తన కెరీర్ డల్ అవుతుంది అని ఏ అవకాశాన్ని బడితే ఆ అవకాశాన్ని ఒప్పుకోలేదు.
అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినప్పటికీ ఆ సినిమా లోని పాత్ర నచ్చితేనే ఓకే చెప్పడం ఈమెకు అలవాటు.అందుకే తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేయలేక పోయింది.ఇక సాయి పల్లవి ఇటీవలే నటించిన సినిమాల్లో ”గార్గి” ( Gargi Movie ) ఒకటి.
ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియెన్స్ ను కూడా అలరించింది.
మరి తాజాగా ఈ సినిమాలో సాయి పల్లవి నటనకు గాను ఈమెకు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు దక్కింది.లేటెస్ట్ గా ముంబైలో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ జరిగాయి.ఈ అవార్డ్స్ కి ఈమెకు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు దక్కింది.
గార్గి సినిమాలో ఈ అమ్మడి నటనకు ఈ అవార్డు రావడం జరిగింది.మరి ఈ అవార్డుల కోసం సాయి పల్లవి ముంబై విచ్చేయగా ఈమెకు సంబందించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రెడ్ శారీలో సాయి పల్లవి చూపరులను ఆకట్టుకుంది.