వాట్సాప్‌లో అవతార్ ని క్రియేట్ చేయడం వచ్చిందా? ఇక్కడ చూడండి మరి!

జనాలు ఇపుడు సోషల్‌ మీడియా ప్రియులు అయిపోయారు… దాంతో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ రోజుకొక అప్డేట్ తెస్తూ వినియోగదారులను ఖుషీ చేస్తున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మెసేజింగ్ దిగ్గజ యాప్ వాట్సాప్( WhatsApp ) నిత్యం ఏదోఒక అప్డేట్ తెస్తూ కస్టమర్లను ఖుషీ చేస్తోంది.

 Have You Created An Avatar On Whatsapp Look Here ,whatsapp Avatars, Whatsapp Ne-TeluguStop.com

ఈ క్రమంలోనే వాట్సాప్‌లో మెసేజ్‌లకు రిప్లై ఇచ్చేందుకు రకరకాల ఎమోజీలు, స్టిక్కర్స్, క్విక్ రియాక్షన్స్ ప్రవేశ పెట్టగా అవి సూపర్ పాపులర్ అయ్యాయి.కాగా ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా డిజిటల్‌ అవతార్‌( Avatar )లు వచ్చాయి.

ఇందులో మీ అభిరుచికి తగ్గట్లు మీరే ఒక అవతార్‌ను తయారు చేసి, వాట్సాప్‌ డీపీగా పెట్టుకోవచ్చు.

ప్రస్తుతం ఈ డిజిటల్‌ అవతార్‌ల ట్రెండ్ నడుస్తోంది.

చాలామంది తమ డిజిటల్‌ అవతార్‌( Digital avatar )లను క్రియేట్ చేసుకుంటూ వాట్సాప్ డీపీలుగా పెట్టుకుంటూ… ఫ్రెండ్స్ కి షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.మరికొంతమందికి మాత్రం వీటిగురించి విషయం అస్సలు తెలియని తెలియదు.

మరికొంతమందికి మాత్రం వీటిని ఎలా క్రియేట్ చేయాలో తెలియడం లేదు.కాబట్టి వీటిని ఎలా క్రియేట్ చేయాలి, ప్రొఫైల్‌ పిక్‌గా ఎలా పెట్టుకోవాలి, ఎలా డిలీట్‌ చేయాలో వివరంగా తెలుసుకుందాం.

ఇపుడు అవతార్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం…

Telugu Avatars, Avatar, Tech, Whatsapp, Whatsapp Tips-Latest News - Telugu

1.దానికి ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ యాప్‌ ఓపెన్‌ చేసి టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే 3 చుక్కలపై క్లిక్‌ చేయండి.

2.ఆ తరువాత అక్కడ కనబడిన సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ప్రొఫైల్ పిక్చర్‌ మార్చే ఐకాన్ సెలక్ట్ చేయండి.

3.ఇప్పుడు మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి.కుడివైపు చివర్లో కనిపించే ‘అవతార్‌’ను ఇపుడు ఎంచుకోండి.

4.ఇప్పుడు మీకు నచ్చిన స్కిన్‌ కలర్‌, కళ్లు, ముక్కు, నోరు షేప్‌, హెయిర్‌ స్టైల్‌, డ్రెస్‌ వంటి ఆప్షన్లు ఇస్తూ అవతార్‌ పోస్టర్‌ను రెడీ చేసుకోండి.

Telugu Avatars, Avatar, Tech, Whatsapp, Whatsapp Tips-Latest News - Telugu

5.ఇపుడు అవతార్‌ ఇమేజ్‌ రెడీ అయిన తర్వాత సేవ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసాక స్క్రీన్‌ కింద ‘యూజ్‌ యాస్ ప్రొఫైల్‌ పిక్చర్‌’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.

6.ఇపుడు దాన్ని సెలక్ట్ చేసి.మీ అవతార్‌ను వాట్సాప్ డీపీగా పెట్టుకోండి.

7.ఈ అవతార్‌ పిక్స్‌ను మీరు కావాలంటే ఇతరులకు కూడా షేర్‌ చేయవచ్చు.ఎమోజీలుగా రిప్లై కూడా ఇవ్వొచ్చు.మరెందుకాలస్యం… రెచ్చిపోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube