సోషల్ మీడియాలో( Social Media ) ప్రతీ గంటకీ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది.అందులో కొన్ని సరదాగా ఉంటే, మరికొన్ని చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి.
కొన్నిటిని చూడడానికి ఒకింత జుగుప్సాకరంగా ఉంటే… మరికొన్ని చాలా ఆసక్తికరంగా ఉంటాయి.ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దానిని చూసిన నెటిజన్లు ‘మానవత్వం పరిమళించిన వేళ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మనలో చాలామందికి వీధి కుక్కలంటేనే( Stray Dogs ) కాస్త చిన్నచూపు.ఎంత వివక్ష అంటే… తన వీధిలోనే వుంటూ, వదిలేసిన ఎంగిలి మెతుకుల్ని తింటూ యజమానులకు తెలియకుండా ఇంటికి కాపలా కాసే వీధి కుక్కల కంటే… ఎక్కడినుండో దిగుమతి చేయబడిన బొచ్చుకుక్క పిల్లలంటేనే మనోళ్ళకి రోకు ఎక్కువ.ఆ క్రమంలోనే మనవాళ్ళు వీధి కుక్కలపైన కాస్తైనా జాలిదయ లేకుండా ప్రవర్తిస్తుంటారు.
పొరపాటున ఇంట్లోకి వస్తే… కొట్టి తరిమేస్తూ వుంటారు.ఇలా ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకునేవారు కూడా వీధి కుక్కల విషయంలో దయ లేకుండా ప్రవర్తించడం చాలా బాధకరమైన విషయం.
అలాంటిది వీధి కుక్కల్ని చూసిన ఓ బాలుడు ( Boy ) తనలోని దయాగుణాన్ని, మానవత్వాన్ని చాటుకున్నాడు.అవి కూడా మనలాగే జీవరాశులు అని, వాటికి కూడా స్వేశ్చగా బతికే హక్కు ఉందని నిరూపించాడు.కాగా అతను చేసిన పనికి నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.మిస్టర్ నమన్ రాజపుత్ అనే ఇన్‌స్టా ఖాతా నుంచి పోస్ట్ అయిన వీడియో ప్రస్తుతం వైరల్ కావడం మనం గమనించవచ్చు.
ఓ బాలుడు స్కూల్‌కి వెళ్తున్న క్రమంలో నిస్సహాయంగా చూస్తున్న వీధికుక్కల్ని చూసి తాను స్కూల్‌కి తీసుకెళ్తున్న లంచ్ బాక్స్‌లోని ఫుడ్‌ని వీధి వాటికి తినిపించాడు.వయసులో చిన్న అయినా సంస్కారంలో శిఖరాగ్ర స్థాయిలో ఉన్న ఆ యువకుడి సేవాగుణాన్ని చూసిన నెటిజన్లు.
అతన్ని అభినందిస్తున్నారు.