కొత్త జీవితం ప్రారంభించా... మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలి: మనోజ్

గత కొద్ది రోజులుగా మంచు మనోజ్( Manchu Manoj ) పేరు పెద్ద ఎత్తున వార్తల్లో వినపడుతోంది.ఈయన ఈనెల మూడవ తేదీ భూమ మౌనికను(Bhuma Mounika) పెళ్లి చేసుకోవడమే కాకుండా గత మూడు రోజుల క్రితం విష్ణుతో పెద్ద ఎత్తున గొడవపడ్డారు.

 Start A New Life May Your Blessings Be Always Manoj , Meghansh, Srihari ,mounika-TeluguStop.com

ఇలా ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మనోజ్ విష్ణు పేర్లు సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాయి.ఇలా నాలుగు గోడల మధ్య జరుగుతున్న విభేదాలను రోడ్డుపైకి తీసుకువచ్చారు అంటూ పెద్ద ఎత్తున వీరి మధ్య జరుగుతున్న గొడవలకు కారణాలు ఏంటి అని ఆరా తీస్తున్నారు.

ఇక ఈ గొడవ తర్వాత మనోజ్ ఎక్కడికి వెళ్లినా లేదా సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు చేసిన క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

Telugu Aham Brahmasmi, Manoj, Meghansh, Mounika, Srihari, Tollywood, Di Fish-Mov

ఈ క్రమంలోనే నటుడు మనోజ్ తాజాగా దివంగత నటుడు శ్రీహరి( Srihari )కుమారుడు మేఘాన్స్ కొత్త సినిమా ప్రారంభోత్సవంలో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా మనోజ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.తన బుజ్జి తమ్ముడు మేఘాన్స్( Meghansh ) ఈ సినిమాతో మంచి హిట్ అందుకోవాలని మనోజ్ ఆకాంక్షించారు.

ఇక తన సినిమాల గురించి మాట్లాడుతూ తను వాట్ ది ఫిష్( What Di Fish ) సినిమాతో పాటు మరొక సినిమాలో కూడా నటించబోతున్నానని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విషయాలన్నింటిని కూడా తెలియ చేయబోతున్నట్లు వెల్లడించారు.

Telugu Aham Brahmasmi, Manoj, Meghansh, Mounika, Srihari, Tollywood, Di Fish-Mov

ఇక ఈ కార్యక్రమంలో ఈయన మాట్లాడుతూ తాను కొత్త జీవితం ప్రారంభించానని, మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లప్పుడు మాపై ఉండాలని ఈయన కోరుకున్నారు.మాకు ఒక సంతోషకరమైన జీవితాన్ని ఇస్తారని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. మాకు సినిమాని జీవితం… ప్రేక్షకులే లైఫ్… సినిమా లేకపోతే మాకేమీ లేదు అందుకే తిరిగి సినిమాల వైపే వస్తున్నాను అంటూ ఈ సందర్భంగా మనోజ్ సినిమాల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇలా దాదాపు ఆరు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి మనోజ్ తిరిగి వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారని తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube